ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. కల్కి రిలీజ్‌ ముందే విదేశాలకు.. నాగ్ అశ్విన్ ప్లాన్ అదేనా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కొత్త ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. సినిమా రిలీజ్ కు ఇంకా ఐదు రోజులే టైం ఉండగా, ప్రభాస్ ను ఫారిన్ టూర్ కు పంపిస్తున్నారట డైరెక్టర్ నాగ్ అశ్విన్. మరి నాగ్ అశ్విన్ ఎందుకిలా చేస్తున్నాడో తెలుసుకుందాం పదండి.

ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్న మూవీ కల్కి 2898 రిలీజ్ కు ఇంకా ఐదు రోజుల టైమ్ మాత్రమే మిగిలి ఉంది. కౌంట్ డౌన్ మొదలైన క్రమంలో ప్రస్తుతం చిత్ర బృందం పూర్తి స్థాయి ప్రమోషన్లపై దృష్టి పెట్టారు. బుజ్జి ఇంట్రడ్యూస్ ఈవెంట్, భైరవ బుజ్జి సాంగ్, ట్రైలర్, భైరవ సాంగ్.. ఇలా ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై బజ్ బాగా పెంచేసింది.

Is Prabhas flying to go Europe trip before release of Kalki 2898 AD

రీసెంట్ గా ముంబైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు జూన్ 21న రిలీజ్ అయిన కల్కి రిలీజ్ ట్రైలర్ కూడా అదరగొడుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభాస్ సినిమా రిలీజ్ కి ముందు ప్రమోషన్లలో పాల్గొనకుండా విదేశాలకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ ఇలా చేయడం ఇదే మొదటిసారి ఏమీ కాదు. సాధారణంగా తన సినిమాల రిలీజ్ టైం లో ప్రభాస్ ఇలా ట్రిప్పులు వేస్తూ ఉంటాడు.

ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా రాత్రింబవళ్ళు కష్టపడి పని చేసే ఈ హీరో, మూవీ రిజల్ట్ తో పాటు అప్పటిదాకా పడిన స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడానికి ఇలాంటి పని చేస్తాడు. అందుకే కల్కి 2898 మూవీ రిలీజ్ కాకముందే ఆయన ముంబై చెక్కేస్తున్నాడని తెలుస్తోంది. ఇక ప్రభాస్ యూరప్ ట్రిప్ వెనక డైరెక్టర్ నాగ్ అశ్విన్ హస్తం కూడా ఉందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.

కల్కి 2898 ఏడీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్, ఇంటరాక్షన్ వంటి వాటికి దూరంగా ఉండాలని అనుకుంటున్నారట. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రమోషన్లు లేకుండానే సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. నిజానికి ఇది ప్రభాస్ అభిమానులకు తీవ్ర నిరాశను కలిగించే వార్త. కానీ సలార్ మూవీని కూడా ఇలాగే పెద్దగా ప్రమోషన్స్ చేయకుండా రిలీజ్ చేయగా, హిట్ టాక్ తెచ్చుకుందన్న విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.

Is Prabhas flying to go Europe trip before release of Kalki 2898 AD

దాన్నే సెంటిమెంట్ గా భావించి కల్కి మూవీని కూడా ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. మూవీ రిలీజై, రిజల్ట్ వచ్చి, హడావిడి అంతా తగ్గిన తర్వాత ప్రభాస్ తిరిగి హైదరాబాద్ లో తిరిగి కాలు పెట్టనున్నాడని తెలుస్తోంది. అది కూడా హను రాఘవపూడితో తన నెక్స్ట్ మూవీ టెస్ట్ షూట్ కోసం ప్రభాస్ తిరిగి ఇక్కడికి రాబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X