ఆమెతో రాజ్ తరుణ్ రొమాన్స్ మాములుగా లేదుగా.. లావణ్యతో విడిపోడానికి కారణమిదేనా

గత కొన్ని రోజులు నుంచి టాలీవుడ్ సినిమా దగ్గర బాగా వినిపిస్తూ వస్తున్నా యువ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది జోవియల్ స్టార్ రాజ్ తరుణ్ అనే చెప్పాలి. కాగా రాజ్ తరుణ్ నుంచి ఈ రెండు వారాల్లోనే బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో తాను పలకరించాడు. అయితే ఈ సినిమాల విషయంలో కాదు కానీ మరో విషయంలో అయితే రాజ్ తరుణ్ బాగా హైలైట్ అయ్యాడు.

తన ప్రేమ, ప్రేయసి అఫైర్స్ అంటూ తా పేరు గత కొన్ని రోజులు నుంచి మారు మోగిపోగా ఈ గొడవల్లోనే తన రెండు సినిమాలు గత శుక్రవారం "పురుషోత్తముడు" ఈ వారం "తిరగబడరా సామీ" రిలీజ్ కి వచ్చాయి. అయితే తన మాజీ ప్రేయసి లావణ్యతో పెద్ద ఎత్తున కాంట్రవర్సీలు ఇపుడు నడుస్తున్నాయి. రాజ్ తనకి అన్యాయం చేసాడు అని అతనిపై కేసు పెట్టి ఆమె న్యాయ పోరాటం చేస్తుండగా రాజ్ తరుణ్ కూడా తన దగ్గరా ఆధారాలు ఉన్నాయి నేనూ న్యాయంగానే వెళతాను అని తను కూడా బలంగా చెబుతున్నాడు.

is raj tarun and malvi malhotra tiragabadara saami movie is the big reason for lavanya controversy

అయితే అసలు రాజ్ తరుణ్, లావణ్య నడుమ గొడవ రావడానికి ప్రధాన కారణం లావణ్య చేసే ఆరోపణ ఏదన్నా ఉంది ఉంటే తమ ఇద్దరి మధ్యలోకి నటి మాల్వి మల్హోత్రా రావడమే అని చెబుతుంది. దీనికి సమాధానంగా మాల్వి నాకు రాజ్ తరుణ్ కి సినిమా తప్ప మరో సంబంధం లేదు అని నేను ఎవరినీ లవ్ చెయ్యడం లేదు. నా పనినే ప్రేమిస్తున్నా అంటూ పలు కామెంట్స్ చేసింది.

కానీ తర్వాత తరుణ్ తో తన చాట్స్ లీక్ అంటూ ఇద్దరూ కలిసే ఉన్నారని లావణ్య మరిన్ని సంచలన నిజాలు తీసుకొచ్చింది. అయితే ఇపుడు ఈమె ఆరోపణల్లో నిజం ఉండే ఛాన్స్ లు గట్టిగా కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం కూడా ఈ వారం వచ్చిన "తిరగబడరా సామీ" సినిమానే అనిపిస్తుంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రాల మధ్య కొన్ని సీన్స్ అయితే మామూలు రొమాంటిక్ గా లేవు.

is raj tarun and malvi malhotra tiragabadara saami movie is the big reason for lavanya controversy

ఇద్దరి నడుమ పెదవి ముద్దులు, బెడ్ మీద దొర్లడాలు చూస్తే వారు నిజం లవర్స్ లేదా భార్య భర్తల్లానే కనిపిస్తారు. మరి ఈ క్రమంలో ఈ సినిమా చేస్తున్న సమయంలోనే ఇద్దరికీ ప్రేమ పుట్టి ఉండొచ్చు అని ఈ సినిమా చూసినవాళ్లు తప్పకుండా చెప్పగలరు. దీనితో ఇక్కడ నుంచే అసలు కథ అంతా మొదలయింది అని అనుకోవడానికి ఆస్కారం ఉంది. కాగా లావణ్య కూడా మాల్వి మల్హోత్రాపై ఈ సినిమా విషయం నుంచే ఆరోపణలు చేస్తుంది.

తన రాజ్ తరుణ్ ని ఈ సినిమా సమయంలోనే లాక్కుంది అని ఆరోపించడం సినిమాలో వారిద్దరి రొమాన్స్, కెమిస్ట్రీ కూడా ఆ లెవెల్లోనే ఉండడం వంటివి మాత్రం ఖచ్చితంగా మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇలా ఈ సినిమా మాత్రం ఈ ముగ్గురి విషయంలో పెద్ద పాత్రే పోషించింది అనేలా ఉందని చెప్పుకోవాలి. ఇక వీరి ముగ్గురి కథ ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో వేచి చూడాలి మరి.

More from Filmibeat

Read more about: raj tarun malvi malhotra lavanya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X