Rajinikanth Remuneration: రజినీకాంత్‌కు రికార్డు రెమ్యునరేషన్.. విజయ్‌ను బీట్ చేసిన తలైవా!

హిట్స్, హీరోల సక్సెస్ గ్రాఫ్‌ను బట్టి సినిమా ఇండస్ట్రీలో రెమ్యునరేషన్లు డిసైడ్ అవుతాయనే విషయాన్ని కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే హీరోలు తమ బాక్సాఫీస్ తడాఖాను బట్టి రెమ్యునరేషన్లు డిమాండ్ చేయడంలో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం అవ్వవు. స్టార్స్ హోదా బట్టి నిర్మాత, దర్శకులు పారితోషికాలు సమర్పించుకోవడం ఇండస్ట్రీలో అనవాయితీగా వస్తుంటారు. ఓసారి ఓ హీరో ఎక్కువ డబ్బులు తీసుకొంటే.. మరోసారి మరో హీరో ఈ రేసులో పైచేయి సాధిస్తుంటారు. తాజాగా తమిళనాడులో హీరోల మధ్య పారితోషికం విషయంలో రికార్డులు నమోదు అవుతున్నాయి. తాజాగా కోలీవుడ్‌లో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకొన్న జాబితాలో సూపర్ స్టార్ రజనీకాంత్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

తమిళ సినిమా పరిశ్రమలో అత్యధికంగా రెమ్యునరేషన్ వసూలు చేసిన వారిలో స్టార్ హీరోలు విజయ్, అజిత్, రజనీకాంత్ లాంటి ముందు వరుసలో ఉంటాయి. తమ సినిమాలు బాక్సాఫీస్‌ను కొల్లగొట్టే స్థాయిని బట్టి నిర్మాతలే వారికి ఫీజు చెల్లించుకోవడానికి సిద్దంగా ఉంటారు. కొంత నగదు, మరికొంత ఏరియాల థియేట్రికల్ రైట్స్‌తో వారికి ప్రతిఫలాన్ని ముట్ట చెబుతుంటారు అనే విషయంలో ఎలాంటి దాపరికాలు ఉండవు అనేది ట్రేడ్ రిపోర్ట్.

ajinikanth Beat Vijay in Remuneration Race for Thalaivar 174 x KH238

తమిళ సినిమా పరిశ్రమలో ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకు ఇళయ దళపతి విజయ్ అత్యధికంగా పారితోషికం తీసుకొన్నారట. ఆయన నటించిన తాజా చిత్రం జన నాయగన్ 220 కోట్ల రూపాయల సాలరీని తీసుకొన్నాడనే విషయం హాట్ టాపిక్ అయింది. అయితే తాజాగా రజనీకాంత్ ఈ రికార్డును అధిగమించి విజయ్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకొంటున్నారనే వార్త కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నది.

ప్రస్తుతం రజనీకాంత్ తన 70 ఏళ్ల వయసులో కూడా వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన డేట్స్ కోసం ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారు. ఆయన కమల్ హాసన్‌తో కలిసి నటించే సినిమా ఇండస్ట్రీలో భారీ హైప్ క్రియేట్ చేసింది. Thalaivar 174 x KH238 అనే టెంపరరీ టైటిల్‌తో ప్రీ ప్రొడక్షన్‌లో ఉన్న ఈ సినిమా కోసం భారీగా ఫీజు అందుకొంటున్నట్టు సమాచారం.

కమల్ హాసన్‌తో సంబంధం లేకుండా రజనీకాంత్‌కు ఊహించని విధంగా రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. ఈ సినిమా కోసం 225 కోట్ల రూపాయలను ఇచ్చేందుకు రెడీ అయ్యారు. దాంతో దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకొన్న హీరోల్లో తలైవా టాప్ స్థానంలో ఉన్నారు. విజయ్ రెమ్యునరేషన్‌ కంటే అధికంగా తీసుకోవడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ లెక్కలన్నీ కేవలం అనధికారికంగాను ఉంటాయి. అఫీషియల్‌గా ఎవరూ కూడా చెప్పుకోరనే విషయం అందరికి తెలిసిందే.

రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందే జైలర్ 2 సినిమాతో బిజిగా ఉన్నారు. అలాగే సిబి చక్రవర్తి, సుందర్ సీ దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నారు. అలాగే కమల్‌తో కలిసి మల్టీ స్టారర్ సినిమాకు రెడీ అవుతున్నారు. ఇంకా పలు సినిమాల గురించిన చర్చలు జరుగుతున్నాయి.

More from Filmibeat

Read more about: rajinikanth vijay jana nayagan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X