Game Changer: గేమ్ ఛేంజర్ తో చరణ్ కి 100 కోట్ల నష్టమా? అంత రిస్క్ తీసుకొన్నాడా?

గత కొన్ని వారాల వరకు ఇండియన్ సినిమా దగ్గర హాట్ టాపిక్ గా నిలిచిన సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 అయితే హాట్ టాపిక్ గా వినిపిస్తున్న సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన కోసం చెప్పొచ్చు. కాగా ప్లాప్స్ లో ఉన్న పాన్ ఇండియా దర్శకుడు శంకర్ తో రామ్ చరణ్ అలాగే నిర్మాత దిల్ రాజు చేసిన మొదటి సినిమా ఇది.

మామూలుగా శంకర్ సినిమా అంటే ఏ స్థాయి హైప్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ గేమ్ ఛేంజర్ కి పరిస్థితి ఇలా కాదు. దీనికి ముందు ఇండియన్ 2 అని భారీ ఫ్లాప్ దానికి ముందు కూడా శంకర్ సినిమాలు అంతగా రాణించలేదు. ఇంకోపక్క రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ తో గ్లోబల్ ఫ్యామిలీ తెచ్చుకున్నాడు, కాగా ఈ సినిమాపై తన విషయంలో మాత్రం మంచి అంచనాలు నెలకొన్నాయి.

Is Ram Charan loose Massive 100 crore for because of game changer

ఇక శంకర్ సినిమాలు కూడా చాలా సమయం తీసుకోని వస్తాయని అందరికీ తెలిసిందే. అలానే ఈ సినిమా కూడా చాలా ఆలస్యం అవుతూ వచ్చింది ఈ క్రమంలో చరణ్ మరో ఏ సినిమాకి కూడా కమిట్ అవ్వకుండా ఈ సినిమాకి స్టిక్ అయి ఉండడం మూలాన చరణ్ కి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 కోట్లు నష్టం వచ్చినట్టుగా తెలుస్తుంది.

నిజానికి రామ్ చరణ్ ఈ సినిమా చేస్తున్న సమయంలోనే ఓ భారీ ప్రాజెక్టుని జెర్సీ సినిమా ఫ్రేమ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో చేయాల్సింది. దీనిని ప్రముఖ నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్ వారు అనౌన్స్ చేశారు కూడా.. అయితే గేమ్ ఛేంజర్ కమిట్ అయి ఉండటం మూలాన రామ్ చరణ్ ఆ సినిమాకి ముందు ఒక అయినప్పటికీ నువ్వు చెప్పేసాడు.

దీంతో ఆ సినిమాకి రాంచరణ్ అందుకోవాల్సిన భారీ పారితోషకం ఏకంగా వంద కోట్లు తాను వదులుకున్నట్టుగా తెలిసింది. దీనికి కారణం గేమ్ ఛేంజర్ పై తనకున్న నమ్మకం ఒకటే అన్నట్టుగా టాక్. ఇలా గేమ్ చేంజర్ కోసం రామ్ చరణ్ ఏకంగా 100 కోట్ల రెమ్యూన రేషన్ ని వదులుకోవాల్సి వచ్చింది.

Is Ram Charan loose Massive 100 crore for because of game changer

అయితే గేమ్ చేంజర్ కు మాత్రం రామ్ చరణ్ కేవలం 70 కోట్లు మాత్రమే తీసుకున్నట్టుగా సినీ వర్గాల్లో ఓ టాక్ ఉంది. మరి ఈ సినిమా కోసం అలాంటి ఆఫర్ వదులుకోవడం అంటే పెద్ద విషయమే అని చెప్పాలి. అయినప్పటికీ తను అంత మొత్తం వదులుకున్నా సరే గేమ్ చేంజర్ లో మాత్రం తన నటనకు మంచి మార్కులు పడుతున్నాయి.

సో ఒక నటుడుగా తనకు వచ్చే ఈ ఈ ప్రశంసల ముందు అలాంటి వందల కోట్లు చిన్నవిగానే అనిపిస్తాయని చెప్పొచ్చు. ఇక గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ సరసన అంజలి బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించగా తమిళ విలక్షణ నటుడు దర్శకుడు ఎస్జె సూర్య బలన్ పాత్రను నటించారు. అలాగే నిర్మాత దిల్ రాజు సినిమాని ఏకంగా 400 పైగా కోట్లు బడ్జెట్ పెట్టి తలకెక్కించారు ఇక ఈ సినిమాల తర్వాత రామ్ చరణ్ యువ దర్శకుడు బుచ్చిబాబు సాన అలాగే బుచ్చిబాబు గురువు సుకుమార్లతో పలు భారీ ప్రాజెక్టులు చేయనున్నాడు.

More from Filmibeat

Read more about: ram charan game changer shankar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X