రానా విగ్గు పెట్టుకొంటున్నాడా? నిజం జుట్టు కాదా? ఓపెన్ అయిన భళ్లాలదేవుడు!

దగ్గుబాటి నట వారసుడిగా రానా వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆలరిస్తూ దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో తన మార్కు చాటుకొంటున్నాడు. ఎక్కువ సినిమాలు కాకుండా తన ఇమేజ్‌కు తగిన క్యారెక్టర్స్‌తో దూసుకుపోతున్నాడు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, డిస్టిబ్యూటర్‌గా పలు రకాలుగా తన వంతుగా సినిమా పరిశ్రమకు సేవలు చేస్తున్నాడు. అయితే తన జుట్టు గురించిన సీక్రెట్‌ను బయటపెట్టి షాకిచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన మూవీ ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన రానా హీరోగా పలు చిత్రాల్లో నటించాడు. కానీ హీరోగా కమర్షియల్ సినిమాలు వర్కవుట్ కాకపోవడంతో బలమైన క్యారెక్టర్లతో నటుడిగా తనకంటూ ఓ మార్కు చూపించాడు. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీని సాధించాడు. ఇక ఓ వైపు నటిస్తూనే మరోవైపు సినీ నిర్మాణంలో కూడా రాణిస్తున్నారు.

Is Rana Daggubati using Wig instead of Natural Hair Baahubali actor reveals to Dulquer Salman and Meenakshi Chowdary in Lucky Bhaskar

అంతేకాకుండా నటుడు, నిర్మాతగానే కాకుండా రియాలిటీ షో హోస్ట్‌గా కూడా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొన్నారు. అలాగే సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలు చేస్తూ తన మిత్రులకు, నిర్మాతలకు సపోర్టుగా నిలుస్తున్నారు. తాజాగా నాగవంశీ దర్శకత్వంలో రూపొందిన లక్కీ భాస్కర్ సినిమాను తన భుజాల మీదుకు ఎత్తుకొని ప్రచారం చేస్తున్నాడు.

తాజాగా క్యాండింట్ ఇంటర్వ్యూ విత్ రానా దగ్గుబాటి అనే పేరుతో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరీతో కలిసి ఓ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా దుల్కర్‌తో మాట్లాడుతూ నీ జుట్టు బాగుంది. నీ క్రాఫ్ వల్ల ఎలాంటి పాత్రలకైనా సరిపోతారు అంటూ కామెంట్ చేశాడు. దాంతో మీనాక్షి చౌదరీ మాట్లాడుతూ.. అవును కేరళ నుంచి వచ్చే హీరో, హీరోయిన్ల జుట్టు సూపర్‌గా ఉంటుంది. అందుకు కారణం కొబ్బరినూనే వల్లే కావొచ్చు అని ఆమె అన్నారు.

Is Rana Daggubati using Wig instead of Natural Hair Baahubali actor reveals to Dulquer Salman and Meenakshi Chowdary in Lucky Bhaskar

అయితే ఇలా మీనాక్షి, రానా ప్రశంసలపై స్పందిస్తూ.. రానా నీ జుట్టు కూడా బాగుంటుంది అని దుల్కర్ సల్మాన్ అన్నాడు. దాంతో నాది రియల్ జుట్టు కాదు.. ఇది హెయిర్ బాండ్ ఫిక్సింగ్. విగ్గులాంటిది పెట్టుకొంటాను అని చెప్పగానే.. మీనాక్షి, దుల్కర్ షాక్ అయ్యారు. అంతలోనే తేరుకొన్న దుల్కర్.. ఇలా మీరు నిజాయితీగా మీ హెయిర్ గురించి బయటపెట్టి మాట్లాడటం బాగుంది అంటూ కితాబిచ్చారు. దాంతో స్వయంగా నా జుట్టు నేచురల్ కాదు.. విగ్ అని చెప్పడంతో రానాను కూడా ప్రశంసిస్తున్నారు.

ఇదిలా ఉండగా, రానా దగ్గుబాటి ఇటీవల రజనీకాంత్ నటించిన వేట్టయన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో విలన్ పాత్ర ద్వారా ఆయన తన ఫెర్ఫార్మెన్స్‌తో రజనికి పోటాపోటీగా నటించారు. ప్రస్తుతం ఇంకా ఆయన కొన్ని భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X