నెలకు 40 లక్షల భరణం ఇస్తే.. విడాకులు ఇస్తా.. జయం రవికి భార్య షాక్
తమిళ సినిమా పరిశ్రమలో స్టార్ హీరో జయం రవి అలియాస్ రవి మోహన్ మీడియా సమావేశం సంచలనం రేపింది. భార్య అర్తీతో విడాకులు, ప్రియురాలు కెనీషాతో బ్రేకప్ వ్యవహారాలతో విసిగిపోయిన ఆయన మీడియా సమావేశంలో భోరున విలపించాడు. ఎమోషనల్‌గా కంట్రోల్ తప్పాడు. భార్యపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. అయితే తన జీవితాన్ని ఓ సీనియర్ హీరోయిన్ నాశనం చేసింది అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. అయితే భార్యతో విడాకుల వ్యవహారంపై భావోద్వేగానికి లోనైన ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో భార్య తనకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న విడాకుల భరణం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది. అయితే భారీ మొత్తంలో భరణాన్ని చెల్లించాల్సిన మొత్తంపై రవి మోహన్‌కు సానుభూతి వ్యక్తమవుతున్నది. డిమాండ్ చేస్తున్న భరణం ఎంతనే వివరాల్లోకి వెళితే..
ప్రేమ పేరుతో ఆరతి నన్ను బ్లాక్ మెయిల్ చేసింది. పెళ్లి చేసుకోకపోతే కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని నన్ను ఒత్తిడికి గురి చేసింది. ఆ సమయంలో ఆరతీని పెళ్లి చేసుకోవద్దని నా తల్లిదండ్రులు హెచ్చరించారు. అయినా వారి మాటలను పెడచెవిన పెట్టి వివాహం చేసుకొన్నాను. అందుకు ప్రతిఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే పెళ్లి తర్వాత నాకంటూ సొంతంగా బ్యాంక్ అకౌంట్ లేకపోయింది. ఆర్తీ, నా పేరున జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశాం. అందులో నుంచి డబ్బు డ్రా చేస్తే.. ఎందుకు చేశావని వేధించేది. నేను కష్టపడి ఎంతో సంపాదించాను. కానీ వాటిని అనుభవించే హక్కు నాకు లేకపోయింది. భార్యతో సపరేషన్ తర్వాత నేను కట్టుబట్టలు, చిల్లిగవ్వ లేకుండా బయటకు వచ్చాను. రెంటెడ్ అపార్ట్‌మెంట్‌లో ఉండాల్సిన ఖర్మ పట్టింది అని ఆయన భావోద్వేగానికి గురయ్యాడు.
అయితే ప్రస్తుతం రవి మోహన్, ఆరతి విడాకుల వ్యవహారంపై మధ్యవర్తుల ద్వారా చర్చలు జరుగుతున్నాయి. కోర్టు ద్వారా విడాకులు పొందేందుకు సానుకూలంగా సమస్యను పరిష్కరించుకొనేందుకు చర్యలు చేపడుతున్నారు. అయితే ఆరతి నుంచి భారీ మొత్తంలో భరణం (Alimony) డిమాండ్ చేస్తున్నారు. ఆ విషయం రవి మోహన్‌కు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది అనే మాట వినిపిస్తున్నది.
అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వార్తల ప్రకారం.. రవి మోహన్ నుంచి డైవోర్స్ కోరుకొంటున్న ఆరతి పెద్ద మొత్తంలో పరిహారాన్ని కోరుకొంటున్నారు. నెలసరి ఖర్చుల కోసం, ఇతర మెయింటెనెన్స్ కోసం నెలకు 40 లక్షల రూపాయల భరణాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత మొత్తం డిమాండ్ చేయడం అన్యాయం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే భర్తల నుంచి భార్యలు భారీగా భరణాన్ని డిమాండ్ చేయడంపై భారతీయ చట్టాలు, కోర్టులు మరోసారి దృష్టిపెట్టాలి. కంపెనీల సీఈవోల జీతం లెవెల్‌లో నెలసరి భరణాన్ని డిమాండ్ చేయడం లూటీ, దోపిడి చేయడం లాంటిదే. ఇలాంటి చట్టాలు పురుషులకు ప్రతికూలంగా మారుతున్నాయి అనే కామెంట్స్ నెటిజన్ల నుంచి భారీగా వినపడుతున్నాయి. జయం రవి మద్దతుగా పలు పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications