ప్రభాస్ పెళ్లి ఆలస్యానికి కారణాలు ఇవేనా? అనుష్క శెట్టి అఫైర్ కారణమా?
రెబల్ స్టార్ ప్రభాస్ తన జన్మదినాన్ని తన అభిమానులు, కుటుంబ సభ్యులు ఘనంగా జరుపుకొంటున్నారు. ఈ ఏడాది కల్కి మూవీతో సంచలన విజయం సాధించడం కూడా ఫ్యాన్స్‌కు ఈ బర్త్ డే పండుగలా మారింది. అయితే వరుస విజయాలతో దూసుకెళ్లినా అభిమానులకు ఒక్కటే అసంతృప్తిగా మిగిలింది. మా హీరో పెళ్లి ఎప్పుడు చేసుకొంటారనే ప్రశ్న అందర్నీ వెంటాడుతున్నది. అయితే తన పెళ్లికి ఆలస్యం ఓ హీరోయిన్‌తో ఉన్న అఫైర్ కారణమా? లేదా మరేదైనా కారణమా అనే వివరాల్లోకి వెళితే..
భారతీయ సినిమా పరిశ్రమలో సల్మాన్ ఖాన్ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఎవరంటే గుర్తుచ్చే పేరు ప్రభాస్. అయితే తన స్నేహితులు, సన్నిహితులు, అభిమానుల నుంచి ఎప్పడైనా ఎదురయ్యే ప్రశ్న ప్రభాస్ పెళ్లెప్పుడు?. కానీ ఆయన గానీ, వారి కుటుంబ సభ్యులు నుంచి స్పష్టమైన జవాబు మాత్రం లభించదు. ఎప్పుడూ దాట వేసే ప్రయత్నాలే కనిపిస్తాయి.

కానీ ప్రభాస్ పెద్దమ్మ మాత్రం ప్రభాస్ పెళ్లి గురించి అప్పుడప్పుడు లీకులు, అప్‌డేట్స్ ఇస్తుంటుంది. దాంతో ఆయన ఇక పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త కొన్నాళ్లు మీడియాలో కనిపించింది.. ఆగిపోతుంది. ఇలా కొన్నేళ్లుగా ప్రభాస్ మ్యారేజ్ విషయం ఎడతెగని డైయిలీ సీరియల్‌లా కొనసాగుతూనే ఉంది. కానీ ఆయన వెడ్డింగ్‌పై మాత్రం ఎలాంటి క్లారీటీ లేకపోయింది.
అయితే ప్రభాస్ పెళ్లికి కారణాలు పలు రకాలుగా ఉన్నాయనేది తన సన్నిహితులు చెబుతుంటారు. బాహుబలి సినిమా సుమారుగా 5 ఏళ్లు కొనసాగడంతో ఆ మూవీ తర్వాత చేసుకొందామని అనుకొన్నారట. బాహుబలి సంచలన విజయం సాధించడంతో వరుసగా ప్రాజెక్టులు కమిట్ అయ్యారు. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి లాంటి సినిమాలు పూర్తి చేసే పనిలో పెళ్లి గురించి మర్చిపోయారంటారు.

ఇక ప్రభాస్‌తో పలు హీరోయిన్లకు అఫైర్ అనేది తరచూ వినిపిస్తుంటుంది. తొలుత త్రిషతో సన్నిహితంగా ఉంటున్నారనే వార్తలు కెరీర్ తొలినాళ్లలో వినిపించాయి. కానీ అవి గాలి వార్తలుగానే మిగిలిపోయాయి. ఆ తర్వాత శ్రద్దా కపూర్, పూజా హెగ్డే లాంటి తారల పేర్లు ఆయన పక్కన జోడించారు. కానీ అవి కూడా తెలిపోయాయి. కానీ అనుష్క శెట్టితో బంధం మాత్రం ప్రత్యేకంగా మారడం అందరికి తెలిసిందే.
ప్రభాస్, అనుష్క శెట్టి ఇద్దరు కూడా కలిసి వరుసగా సినిమాలు చేశారు. బిల్లా, మిర్చి, బాహుబలి లాంటి సినిమాలు వారి మధ్య కెమిస్ట్రీని బాగా గుర్తు చేసింది. దాంతో వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు విస్తృతంగా ప్రచారమయ్యాయి. కానీ మా మధ్య ఉన్నది ఫ్రెండ్ షిప్ కంటే ఎక్కువ రిలేషన్ అని పలు సందర్బాల్లో వెల్లడించారు. అయితే చాలా మంది అనుష్కతో ఉన్న రిలేషన్‌షిప్ కారణంగానే ప్రభాస్ పెళ్లి ఆలస్యం అయిందని చెప్పుకొంటారు. అది నిజమా? అబద్దామా? అనేది పక్కన పెడితే.. ప్రభాస్ పెద్దమ్మ చెప్పినట్టు ఈ ఏడాది వివాహం జరిగిదే ప్రభాస్ ఫ్యాన్స్‌కు అంతకంటే పెద్ద పండుగ ఏముంటుంది.


Click it and Unblock the Notifications











