ప్రభాస్‌కు షూటింగులో గాయాలు.. హాస్పిటల్‌లో చేరిక అంటూ!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తీరికలేకుండా షూటింగ్ బిజీలో ఉన్నారు. బాహుబలి చిత్రం తర్వాత నుంచి బిగ్ ప్రాజెక్ట్స్ లో మునిగిపోయారు. డార్లింగ్ సినిమాకు ఇండియాలోనే కాకుండా వరల్డ్ మార్కెట్లను మంచి డిమాండ్ ఉన్న కారణంగా బిగ్ స్కేల్ చిత్రాలను తెరకెక్కించడంలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ప్రభాస్ అరడజనుకు పైగా చిత్రాలతో బిజీ అయ్యారు. ఒక్కో సినిమాను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఆయన డేట్స్ కోసం దర్శక నిర్మాతలు ఎంతలా ప్రయత్నిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే అభిమానులకు ప్రభాస్ ఏడాదికి రెండు సినిమాలు పూర్తి చేస్తానని హామీని ఇచ్చారు. అందుకు అనుగుణంగానే డార్లింగ్ శరవేగంగా తన సినిమాలకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేస్తున్నారు.
చివరిగా ప్రభాస్ క్రియేటివ్ డైరెక్టర్ నాగశ్విన్ దర్శకత్వంలో ' కల్కి 2898 ఏడీ' చిత్రంలో నటించి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ' సలార్ : పార్ట్ 1- సీజ్ ఫైర్' చిత్రంలో తన యాక్షన్ స్టామినాను చూపించి అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇలా వరుసగా భారీ చిత్రాలతో ఇండియన్ ఆడియన్స్ తో పాటు వరల్డ్ ఆడియన్స్ ను కూడా అలరిస్తున్నారు. ప్రేక్షక ఆదరణ పొందడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా ప్రభాస్ కాసుల వర్షం కురిపిస్తున్నారు.

ఇండియాలోనే బిగ్గెస్ట్ యాక్షన్ సినిమాలు చేస్తున్న హీరోల జాబితాలో ప్రభాస్ మొదటి వరుసలో నిలిచారు. ప్రభాస్ నుంచి ఏదైనా సినిమా కన్ఫర్మ్ అయిందంటే ఆయన ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా భారీ యాక్షన్ సీన్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ కారణంగా ప్రభాస్ కూడా అందుకు తగినట్టుగా తన బాడీని మలుచుకుంటున్నారు. ప్రత్యేకమైన డైట్లు, స్పెషల్ జిమ్ ట్రైనింగ్ తో సమయం గడుపుతున్నారు. సినిమా సినిమాకు మెరుగైన ప్రదర్శనను కనబరిచేందుకు తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో ప్రభాస్ నుంచి ఎప్పుడు ఎలాంటి అప్డేట్స్ వస్తాయా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ తాజాగా ప్రభాస్ గురించి అభిమానులను కలవరపెట్టే ఓ న్యూస్ నెత్తిన వైరల్ గా మారింది. డార్లింగ్ ప్రభాస్ తాజాగా గాయాల పాలయ్యారని ఆ వార్త సారాంశం. ఇంట్లోనే ప్రభాస్ స్టెప్స్ పైనుంచి కాలుజారి పడిపోయారని, దాంతో స్వల్పంగా గాయాల పాలయ్యారని ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఎలాంటి స్పష్టమైన అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ ఇంకా ఆందోళనకు గురయ్యారు.

ఇక ఇదే విషయమై ప్రభాస్ టీం స్పందించింది. డార్లింగ్ కి ఎలాంటి గాయాలు కాలేదని క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో స్టెప్స్ పైనుంచి పడిపోయాడని వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. అలాంటి వార్తలను ఎవరూ కూడా వ్యాప్తి చెందించకూడదని విజ్ఞప్తి చేశారు. ప్రభాస్ టీం స్పందించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం డార్లింగ్ తన రాబోయే చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారని కూడా టీం అప్డేట్ ఇచ్చింది. డార్లింగ్ నుంచి రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2898 ఏడీ చిత్రాలు రావాల్సి ఉంది. అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోని లోకి సినిమాటిక్ యూనివర్స్ లో కూడా ప్రభాస్ నటించబోతున్నారని సమాచారం. ఇక త్వరలో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'లో రుద్రాగా అలరించబోతున్నారు.


Click it and Unblock the Notifications











