ఒక్క సినిమాకు 670 కోట్ల రెమ్యునరేషన్.. అత్యధిక పారితోషికం తీసుకొంటున్న ఆ హీరో ఎవరో తెలుసా?
సినిమా ప్రపంచంలో నటీనటులకు ఉన్న ఫాలోయింగ్, క్రేజ్‌ను బట్టి వారి పారితోషికాలు నిర్ణయిస్తారు. తమ సినిమాలు కలెక్ట్ చేసే బాక్సాఫీస్ నెంబర్లను బట్టి స్టార్స్ కూడా భారీ రెమ్యునరేషన్లను డిమాండ్ చేస్తారు. పాత్రలు, సినిమా బడ్జెట్‌ను ఆయా హీరోలకు రెమ్యునరేషన్లను ముట్టజెపుతారు. అయితే ప్రస్తుతం ఓ హాలీవుడ్ హీరో రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారింది. ఆ హీరో రెమ్యునరేషన్ వివరాల్లోకి వెళితే..
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో డాక్టర్ డూమ్ పాత్రకు అద్బుతమైన పాలోయింగ్ ఉంది. ఆ పాత్రను పోషించే రాబర్ట్ డౌనీ జూనియర్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేషమైన ఫాలోవర్స్, అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన సినిమాలు విడుదలైతే ఫ్యాన్స్ చూడటానికి ఎగబడుతారంటే ఏ మాత్రం సందేహం అక్కర్లేదు.

రాబర్ట్ డౌనీ జూనియర్ తనకు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి భారీగా పారితోషికాన్ని డిమాండ్ చేస్తారనే ప్రచారం మీడియా వర్గాల్లో ఉంది. అవెంజర్స్, ఓప్పెన్‌హైమర్ ఇతర సినిమాల తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం అవెంజర్స్: డూమ్స్ డే అండ్ అవెంజర్స్: సీక్రెట్ వార్స్. ఈ సినిమాలో నటిస్తున్నట్టు రాబర్ట్ అధికారికంగా ప్రకటించారు.
అవెంజర్స్: డూమ్స్ డే అండ్ అవెంజర్స్: సీక్రెట్ వార్స్ సినిమాకు పాపులర్ డైరెక్టర్ రుస్పో బ్రదర్స్, జో అండ్ ఆంథోని రుస్పో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్టు యూనిట్ తెలిపింది. అయితే డౌనీ నటిస్తున్నారనే వార్త బయటకు పొక్కడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

రాబర్ట్ డౌనీ వివరాల్లోకి వెళితే.. ఆయన ఇటీవల నటజీవితానికి స్వస్తి చెప్పారు. 2019లో ఇక నేను నటించను. రిటైర్మెంట్ తీసుకొంటున్నానని ప్రకటన చేశారు. కానీ రుసో బ్రదర్స్, మార్వెల్ ప్రొడక్షన్స్ నిర్వాహకులు కోరిక మేరకు తన మనసు మార్చుకొన్నారు.
అవెంజర్స్: డూమ్స్ డే అండ్ అవెంజర్స్: సీక్రెట్ వార్స్ సినిమాలో నటించేందుకు ముందుకు వచ్చిన రాబర్ట్ డౌనీ జూనియర్‌కు భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్దపడ్డారు. ఈ సినిమాలోని డాక్టర్ డూమ్ పాత్రలో నటించడానికి ఆయనకు 80 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 670 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. ఈ పారితోషికం వ్యవహరం ప్రపంచ సినిమా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











