India Pak War: పాకిస్థాన్‌కు మద్దతా? కాల్పుల విరమణపై సల్మాన్ ఖాన్ వివాదాస్పద ట్వీట్‌పై నెటిజన్లు ఫైర్
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం క్రమేపి సద్దుమణుగుతున్నది. గతవారం రోజులుగా ఇరు దేశాలపై కమ్ముకొన్న యుద్ద మేఘాలు క్రమంగా వీడిపోతున్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం ద్వారా ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకారం తెలియజేయడం కొన్ని వర్గాలు స్వాగతించగా, మరొకొన్ని వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ఆ ట్వీట్ వివరాల్లోకి వెళితే..
జమ్ము, కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో పాక్ మద్దతు తెలిపిన ఉగ్రవాదులు భారతీయులు, ముఖ్యంగా హిందువులపై కాల్పులు జరిపి మరణహోమం సృష్టించడం దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ దాడికి ప్రతీకారంగా పాక్ సరిహద్దులోని టెర్రరిస్ట్ క్యాంపులపై ఆపరేషన్ సింధూర్ పేరిట కేంద్ర ప్రభుత్వం దాడులు చేసి ధీటుగా బదులిచ్చింది. ఈ నేపథ్యంలో కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలపై పాక్ ఉగ్రవాదులు దాడుల జరపడంపై సల్మాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.

భూతల స్వర్గంగా భావించే కశ్మీర్ ప్రస్తుతం నరకంగా మారిపోయింది. అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. అమాయకుల ప్రాణాలు తీయడం మహాపాపం అని సల్మాన్ ఖాన్ తన ఆవేదనను సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్ వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం జరిగిన తర్వాత కొన్ని భావోద్వేగాలు ఉవ్తెత్తున్న భారతీయుల్లో ఎగిసిపడుతున్నాయి.
ఇలాంటి ఎమోషన్స్ మధ్య సల్మాన్ ఖాన్ మరో ట్వీట్ చేశాడు. కాల్పుల విరమణతో యుద్దం ఆగిపోయింది. అందుకు భగవంతుడికి ధన్యవాదాలు ( Thank God For the Ceasefire) అంటూ ట్వీట్ చేశాడు. అయితే పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్ల సల్మాన్ ట్వీట్ చూసి మరింత కోపోద్రేకులయ్యారు. నీవు పాకిస్థాన్‌ను సమర్ధిస్తున్నావా? అంటూ నెటిజన్లు ఘాటుగా స్పందించారు.
అయితే కాల్పుల విరమణ గురించి తన ట్వీట్‌పై రాద్దాంతం, వివాదం జరిగే అవకాశం ఉందని భావించిన సల్మాన్ ఖాన్ తన ట్వీట్‌ను వెంటనే డిలీట్ చేశాడు. దాంతో మరింత వివాదాస్పదంగా మారింది. అలాంటి ట్వీట్‌ను అనాలోచితంగా ఎందుకు చేయాల్సి వచ్చింది? మళ్లీ ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇలా ఎరక్కపోయి సల్మాన్ ఇరుక్కుపోవడంపై అభిమానులు సందిగ్ధంలో పడ్డారు.
ఇదిలా ఉంటే.. గత కొద్దికాలంగా సల్మాన్ ఖాన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొడుతున్నాయి. గతంలో రిలీజైన కిసి కా భాయ్, కిసి కా జాన్ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. ఇటీవల రిలీజైన సికందర్ చిత్రం కూడా డిజాస్టర్‌గా మారింది. ఈ మధ్య కాలంలో మాఫియా నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తన భద్రతతోపాటు సల్మాన్ తన కెరీర్‌పై ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











