గ్యాంగ్‌స్టర్‌కు షారుక్ భయపడ్డారా? బాబా సిద్దిఖీ అంత్యక్రియలకు దూరంగా ఎందుకు ఉన్నారంటే?

ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య ఘటన బాలీవుడ్‌లో కలకలం రేపింది. ముంబైలో సంచలనం రేపిన తర్వాత సినీ తారలందరూ ఆందోళనలో మునిగిపోయారు. సల్మాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడైన మంత్రిని చంపడంతో లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ ఎవరిని టార్గెట్ చేస్తుందో అనే భయం సినీ ప్రముఖులను వెంటాడుతున్నది. అయితే బాబా సిద్దిఖీ అంత్యక్రియలకు షారుక్ ఖాన్ దూరంగా ఉండటంపై రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. ఆ కథనాల వివరాల్లోకి వెళితే..

బాబా సిద్దిఖి మరణం తర్వాత ఆయన నివాసానికి వెళ్లి.. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, సంజయదత్, శిల్పాశెట్టి, పూజా భట్, రాజ్ కుద్రా లాంటి ప్రముఖులు శ్రద్దాంజలి ఘటించారు. అయితే వీరే కాకుండా చాలా మంది అంత్యక్రియలకు కూడా హాజరయ్యారు. కానీ షారుక్ ఖాన్ మాత్రం దూరంగా ఉండటం పలు రకాల చర్చకు దారి తీసింది.

Is Shah Rukh Khan feared to Lawrence Bishnoi for Not Attending Baba Siddiqui Funerals

బాబా సిద్దిఖీకి అత్యంత సన్నిహితులైన బాలీవుడ్ ప్రముఖుల్లో సంజయ్ దత్, సల్మాన్‌తోపాటు షారుక్ కూడా ఒకరు. అయితే అలాంటి సన్నిహితుడైన కింగ్ ఖాన్ అంత్యక్రియలకు హాజరు కాలేదనే విషయంపై బాలీవుడ్ మీడియాలో పలు రకాల కథనాలు వినిపించాయి. ఈ క్రమంలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఆసక్తికరమైన కథనంలో పేర్కొన్నది.

సల్మాన్ ఖాన్ సన్నిహితుడు కావడం, అలాగే దావూద్ ఇబ్రహీంకు సన్నిహిత రిలేషన్స్ ఉండటం కారణంగా బాబా సిద్దిఖీనే హత్య చేశామని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రకటించిన నేపథ్యంలో షారుక్ వెనుకడుగు వేశారు. పొలిటికల్ హత్యకు తాను లింక్ కాకూడదని, అలాగే సిద్దిఖీకి సన్నిహితులైన వారిపై బిష్ణోయ్ మాఫియా కన్నేశారు. ఆ ఉచ్చులో పడకూడదని ఓ రకమైన భయంతోనే ఆయన దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నారు అని తన కథనంలో పేర్కొన్నది.

Is Shah Rukh Khan feared to Lawrence Bishnoi for Not Attending Baba Siddiqui Funerals

బాబా సిద్దిఖీ అంత్యక్రియలకు హాజరయ్యే వారిపై బిష్ణోయ్ టీమ్ నిఘా పెట్టారు. తనను కూడా వారు టార్గెట్ చేయవచ్చనే ఉద్దేశంతో దూరంగా ఉండాలని అనుకొన్నారు. తన క్లోజ్ ఫ్రెండ్‌కు మనసులోనే నివాళి అర్పించాలని నిర్ణయం తీసుకొన్నారు అని జాతీయ దిన పత్రిక కథనంలో వెల్లడించింది.

ఇదిలా ఉండగా, గతంలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌కు ఓ పార్టీలో పెద్ద గొడవ జరిగింది. ఒకరిపై మరొకరు చేయి వేసుకొనే స్థాయికి వెళ్లారు. ఆ తర్వాత వారిద్దరూ 5 ఏళ్లపాటు మాట్లాడుకోలేదు కూడా. దాంతో బాబా సిద్దిఖీ రంగంలోకి దిగి సల్మాన్, షారుక్‌ను కలిపాడు. ఆయనకు బాలీవుడ్ పరిశ్రమతో మంచి సంబంధాలు ఉన్నాయనే విషయం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X