ENE 2: ఈ నగరానికి ఏమైంది 2 క్రేజీ అప్‌డేట్.. తరుణ్ భాస్కర్ మూవీలో యానిమల్ యాక్టర్!

యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన సెన్సేషనల్ హిట్ ఈ నగరానికి ఏమైంది? ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డీ సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో బడ్డీ కామెడీగానే కాకుండా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా మారి ఇప్పటికీ కల్డ్ సినిమాల జాబితాలో చేరిపోయింది. అయితే 2018 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడంటూ దర్శకుడు తరుణ్ భాస్కర్‌కు పలు మీడియా సమావేశంలో లెక్కలేనన్నీ సార్లు ప్రశ్నించారు.

అయితే ఎప్పటికప్పుడు దాట వేసుకొంటూ వచ్చిన ఆయన తాజాగా ఓం శాంతి శాంతి శాంతి అనే సినిమా ప్రమోషన్స్‌లో ఈ నగరానికి ఏమైంది 2 సినిమా త్వరలోనే ప్రారంభమవుతుందని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సినిమాలోకి టాలెంటెడ్ యాక్టర్ మాగంటి శ్రీనాథ్ చేరడం మరో ఆసక్తికరమైన విషయంగా మారింది. అయితే శ్రీనాథ్ ఈ సినిమాలో భాగం కావడంపై అనేక రకాలుగా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే వాటన్నిటిని చెక్ పెడుతూ చిత్ర యూనిట్ కార్తీక్ పాత్ర గురించి క్లారిటీ ఇచ్చేసింది. సుశాంత్ లేకపోయినా కార్తీక్ పాత్ర కొనసాగుతుంది అని స్పష్టం చేశారు.

Srinath Maganti part of the Ee Nagaraniki Emaindhi 2

యూత్‌లో భారీ అంచనాలతో వచ్చిన ఈ నగరానికి ఏమైంది? సినిమాలో విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో నటించిన విశ్వక్ సేన్ స్టార్ హీరోగా మారడం, అభినవ్ గోమటం మంచి గుర్తింపు ఉన్న కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకొన్నారు. అయితే సాయి సుశాంత్ రెడ్డి కూడా తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకొన్నారు. అయితే ఈ సినిమా నుంచి సాయి సుశాంత్ రెడ్డి తప్పుకోవడం.. ఆ స్థానంలోకి శ్రీనాథ్ మాగంటి చేరుతున్నారనే వార్త క్రేజీగా మారింది.

అయితే ఈ నగరానికి ఏమైంది 2 సినిమా నుంచి తాను తప్పకోవడం వెనుక వ్యక్తిగతమైన కారణాలు ఉన్నాయి. తాను వేరే ప్రాజెక్టులో బిజీగా ఉండటం వల్ల అందుబాటులో లేను. ఈ సినిమాలో భాగం కావడం చాలా అసంతృప్తిగా ఉంది. కానీ ఈ సినిమాకు నా వల్ల ఇబ్బంది కాకుండా ఉండాలని నేను తప్పుకొన్నాను. ఈ చిత్రం మరింత విజయం సాధించాలని కొరుకంటున్నాను. చిత్ర యూనిట్‌కు అభినందనలు అంటూ వివరణ ఇచ్చారు.

అయితే మాగంటి శ్రీనాథ్ ఇటీవల కాలంలో నటుడిగా తనకు తాను ప్రూవ్ చేసుకొన్నాడు. యానిమల్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్నారు. అయితే ఈ సినిమాలో ఆయన నటిస్తున్నారా? లేదా? అనే విషయంపై త్వరలోనే క్లారిటీ వస్తుంది అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X