"స్పిరిట్" లో ప్రభాస్ లుక్ లీక్.. వంగ దెబ్బకు థింకింగ్ మారిపోయిందిగా

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి అవైటెడ్ భారీ కాంబినేషన్ లలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రాలు అన్నీ ఉంటే వాటిలో ఒక పర్టిక్యులర్ సినిమా కోసం మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో మంచి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆ చిత్రం ఏదో కూడా కాదు పాన్ ఇండియా కాదు పాన్ ఆసియ లెవెల్లో ప్లాన్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ "స్పిరిట్" అని చెప్పాలి.

ఈ చిత్రాన్ని సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తుండగా ఈ మాసివ్ ప్రాజెక్ట్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇందులో కొరియన్ బాలయ్య డాన్ లీ ఉన్నాడా లేదా అనే ఆసక్తిగా మారాయి. అయితే ఈ సినిమాపై ఇటీవల సందీప్ రెడ్డి వంగ ఆల్ మోస్ట్ డాన్ లీ ఉన్నట్టుగా కన్ఫర్మ్ చేసేసాడు.

is this is the look of prabhas in spirit sandeep reddy vanga leaked

ప్రభాస్ అసలు సినిమాలో ఎలా ఉండబోతాడో అనేది ఒక హింట్ లాంటిది లీక్ అయ్యింది అని చెప్పాలి. సందీప్ రెడ్డి వంగ టేకప్ చేసిన సినిమాలలో ఆయనుకున్న ఒక అలవాటు క్లియర్ గా కనిపిస్తుంది. సరిగా గమనిస్తే సందీప్ ఏ హీరోతో అయితే సినిమా చేస్తాడో ఆ హీరోకి సినిమాలో మెయిన్ హైలైట్ గా చూపించే లుక్ లోనే తాను కూడా కనిపిస్తాడు.

అలా అర్జున్ రెడ్డి, మొన్న ఆనిమల్ సినిమాలకి కూడా ఉన్నాడు. ఇక ఇపుడు ప్రభాస్ భారీ చిత్రం "స్పిరిట్" లో ఎలా ఉంటాడో ఇపుడు ఒక క్లారిటీ అయితే లీక్ అయ్యిపోయింది అని చెప్పాలి. రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ క్లీన్ షేవ్ లో కనిపించాడు. అయితే గడ్డం తీసేసాడు కానీ కోర మాత్రం ఉంచాడు. దీనితో ప్రభాస్ ని స్పిరిట్ లో ఎలా చూపిస్తాడో ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.

is this is the look of prabhas in spirit sandeep reddy vanga leaked

అయితే ఇదే ఎందుకు సాధ్యం అంటే దానికి మరో కారణం కూడా ఉందని చెప్పొచ్చు. ఈ సినిమాని సందీప్ రెడ్డి వంగ ఒక పవర్ఫుల్ పోలీస్ యాక్షన్ సినిమాగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ తరహా లుక్స్ ని పోలీసులే మైంటైన్ చేస్తారు కదా.. సో ఈ లాజిక్ ప్రకారం ప్రభాస్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఈ ఇంటెన్స్ లుక్ లోనే కనిపిస్తాడని చెప్పడంలో డౌట్ లేదు.

అయితే రానున్న కొన్ని నెలల్లోనే సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుందని సందీప్ రీసెంట్ గానే కన్ఫర్మ్ చేసాడు. ఇపుడు తాను కూడా లుక్ మార్చేశాడు కాబట్టి ఈ బిగ్గెస్ట్ కాంబినేషన్ లో సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి కూడా పలువురు స్టార్స్ కనిపించనున్నారని తెలుస్తుంది. ఈ బిగ్ ప్రాజెక్ట్ ని హిందీ నిర్మాణ సంస్థ టి సిరీస్ వారు నిర్మిస్తుండగా.. 2026 నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి.

More from Filmibeat

Read more about: prabhas don lee spirt
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X