Don't Miss!
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
విశ్వక్ సేన్ పాగల్ లుక్ ఇదేనా ..?
హిట్ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో మంచి జోరుమీదున్నాడు హీరో విశ్వక్ సేన్ . త్వరలో 'పాగల్' గా రానున్నాడు ఈ యంగ్ హీరో . ఫలక్ నామా దాస్, హిట్ సినిమాలు సక్సెస్ అవడంతో విశ్వక్ సేన్ మార్కెట్ బాగా పెరిగింది. ముఖ్యంగా యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. దాంతో సినిమా కథలు విషయం లో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు విశ్వక్ సేన్.
నూతన దర్శకుడు నరేష్ నరేష్ కుప్పిలి , బెక్కం వేణుగోపాల్ దర్శకత్వంలో రూపొందుతున్న "పాగల్ " ఆ మధ్య పూజా కార్యక్రమాలు జరుపుకుంది. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఇంకా మొదలుకాలేదు . త్వరలోనే షూటింగ్ ను మొదలు పెట్టె అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అర్జున్ రెడ్డి' సినిమాకు మ్యూజిక్ అందించిన రధాన్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చనున్నారు.
విశ్వక్ సరసన హీరోయిన్ గా కొత్త అమ్మాయిని అనుకుంటున్నారట చిత్ర యూనిట్. ఈ సినిమాలో విశ్వక్ సేన్ కొత్త లుక్ ఆకట్టుకుంటుందని తెలుస్తుంది. తాజాగా విశ్వక్ కు సంబందించిన ఓ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా విశ్వక్ సేన్ ఓ ఫోటో షూట్ లోపాల్గొన్నాడు దానికి సంబందించిన ఫోటో ను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు . ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక పాగల్ సినిమాలో కూడా ఇదే లుక్ తో కనిపించబోతున్నాడని అభిమానులు అనుకుంటున్నారు.