వరుణ్ తేజ్ కూడా బాగానే పెంచేశాడు.. అది ఎవరిచ్చిన కాన్ఫిడెంట్ అంటే..?
మెగా హీరోలందరిలోనూ వరుణ్ తేజ్‌కు ఉన్న ఇమేజ్ వేరు. మొదట్నుంచీ కొత్తదనాన్ని ప్రయత్నిస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. కేవలం మాస్ మంత్రం జపిస్తూ ఉండిపోకుండా.. అన్ని రకాల జానర్‌లను ట్రై చేస్తూ.. అందరి కంటే ప్రత్యేకమని నిరూపించుకుంటున్నాడు.

కొన్ని ఎదురుదెబ్బలు తాకినా..
ఆడియెన్స్‌ను మెప్పించేందుకు కొత్తదనాన్ని ట్రై చేసే క్రమంలో కొన్ని అపజయాలు ఎదురయ్యాయి. అంతరిక్షం అంటూ మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ కథను చేశాడు. అయితే అది అంతగా ఆకట్టుకోలేకపోయింది. మాస్ ఫాలోయింగ్‌ను సంపాదించుకునేందుకు లోఫర్, మిస్టర్ అంటూ వచ్చిన విజయాన్ని అందించలేకపోయాయి.

వరుస హిట్లతో మంచి ఫామ్‌లోకి వచ్చిన వరుణ్..
తొలిప్రేమ, ఫిదా, ఎఫ్2, గద్దలకొండ గణేష్ లాంటి చిత్రాలతో దూసుకుపోతున్న వరుణ్ తేజ్.. మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. గద్దలకొండ గణేష్ సినిమాలో నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్‌ను పోషించి.. అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రంలో బాక్సాఫీస్ వద్ద తన స్టామినాను నిరూపించుకున్నాడు.

ఇదే ఊపులో పారితోషకాన్ని పెంచేశాడు..
మెగా హీరోల్లో వరుణ్, సాయి ధరమ్ మాత్రమే చాలా తక్కువగా తీసుకుంటున్నారు. అయితే వరుణ్ తేజ్ గ్రాఫ్.. ఈ మధ్య పెరుగుతూనే ఉండటం.. గద్దలకొండ గణేష్ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో తన రెమ్యూనరేషన్‌ను పెంచేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఇంతవరకు మూడు కోట్ల వరకు తీసుకున్న వరుణ్.. ప్రస్తుతం 5నుంచి 8 వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గద్దలకొండ గణేష్ భారీ హిట్ కొట్టడంతో.. తాను ప్రయోగాలు చేసిన జనాలు ఆదరిస్తాననే నమ్మకం రావడంతో తాను తీసుకునే మొత్తాన్ని పెంచినట్లు టాక్. అయితే వరుణ్‌కు పెరిగిన క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు కూడా అందుకు ఓకే అంటున్నారని సమాచారం.

బాక్సింగ్ నేపథ్యంలో..
వరుణ్ తేజ్ మరో కొత్త కథకు ఓకే చెప్పాడు. తన పదో చిత్రంగా బాక్సింగ్ నేపథ్యం ఉన్న కథను ఎంచుకున్నాడు. పాత్రకు తగ్గట్టు తన బాడీని కూడా మేకోవర్ చేసుకునే పనిలో పడ్డట్లు సమాచారం. అల్లు అరవింద్ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రాన్ని అల్లు వెంకటేష్(బాబీ), కిరణ్ కొర్రపాటి, సిద్దులు నిర్మిస్తున్నారు. మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు.


Click it and Unblock the Notifications











