Mega Vs Allu: నీవు ఎక్కడి నుంచి వచ్చావనేది మరిచిపోకు.. అల్లు అర్జున్‌పై వరుణ్ తేజ్ షాకింగ్ ఎటాక్?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పిరియాడిక్ మూవీ మట్కా. సెన్సిబుల్ డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. కీలక పాత్రల్లో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటి వరకు రిలీజైన ఈ మూవీ టీజర్, ట్రైలర్ భారీ బజ్ క్రియేట్ చేశాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా సినిమాలో పాటలు అందర్నీ ఆలరిస్తున్నాయి.
మట్కా సినిమా కోసం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మట్కా సినిమా నవంబర్ 14న ప్రేక్షకులు రిలీజ్ కానున్నది. వైజాగ్ బ్యాక్ డ్రాప్‌గా రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను విశాఖపట్నంలోనే నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగా అభిమానులు భారీగా తరలివచ్చారు.

వైజాగ్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో వరుణ్ తేజ్ భావోద్వేగంతో మాట్లాడారు. ఎంతో కష్టపడి సినిమా చేసినప్పుడు చాలా బాధగా ఉంటుంది. కిందపడినప్పుడు దెబ్బలు తగులుతాయి. మూడు రోజుల క్రితం మట్కా సినిమా చూశాను. చాలా కాన్ఫిడెన్స్‌గా ఉంటుంది. కానీ ఈ సినిమా ఆడుతుందా? లేదా? అనే భయం వెంటాడుతూనే ఉంటుంది అని వరుణ్ తేజ్ అన్నారు.
అయితే తెల్లారుజాము వరకు లావణ్య త్రిపాఠితో మాట్లాడుతూ టెన్షన్‌లో ఉన్నాను. అంతలోనే నాకు ఓ ఫోన్ వచ్చింది. ఎవరా అని చూస్తే మా అన్నయ్య రాంచరణ్ కాల్ చేశాడు. మా అన్న వంద మాటలు చెప్పనక్కర్లేదు. పక్కన ఉండి భుజం తడితే చాలూ. అదే ధైర్యం. నాకు వంద కోట్లు వచ్చినంత ఆనందపడిపోతాను. నాకు ఎప్పుడూ చరణ్ అన్న సపోర్టుగా ఉన్నాడు అని వరుణ్ ఎమోషనల్ అయ్యాడు.
మా బాబాయ్ పవన్ కల్యాణ్, మా పెద్దనాన్న చిరంజీవి గారు ఎప్పుడూ గుండెల్లో ఉంటారు. ఈ మధ్య ఎవరో మాట్లాడుతూ.. ఎప్పడూ వారి గురించే మాట్లాడుతారా? అంటూ కామెంట్ చేశాడు. నేను ఎవరి గురించి మాట్లాడాలో నా ఇష్టం. ఇంట్లో పెద్దోడి అవ్వోచ్చు. కాకపోవచ్చు. కానీ నువ్వు ఎక్కడ మొదలు పెట్టావు? ఎందుకు మొదలు పెట్టావు. ఎక్కడ నుంచి వచ్చావు. నీ సపోర్ట్ ఎవరు అని మరిచిపోతే.. నీ దక్కించుకొన్న సక్సెస్ ఎందుకు పనికి రాదు అంటూ ఘాటుగా కామెంట్స్ చేశారు.
అయితే వరుణ్ తేజ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మెగా, అల్లు ఫ్యామిలీలో జరిగిన విభేదాలనే దృష్టిలో పెట్టుకొనే అల్లు అర్జున్ ఉద్దేశించి పరోక్షంగా కామెంట్స్ చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ కామెంట్స్‌పై అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఈ వ్యాఖ్యలు ఎలాంటి స్పందనను చూపిస్తాయో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











