twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చంపుతుంటే కంప్లయింట్ చేయరేం? మనిషి జీవితానికి విలువ లేదా... హీరో రామ్ ట్వీట్!

    |

    Recommended Video

    Hero Ram Bashes Critics With His Mass Tweet || Filmibeat Telugu

    రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన మాస్ ఎంటర్టెనర్ 'ఇస్మార్ట్ శంకర్'. జులై 18న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఫస్ట్ వీకెండ్ 4 రోజుల్లోనే అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్లిపోయారు.

    అయితే ఈ సినిమాపై విమర్శలు చేసే వారు చేస్తూనే ఉన్నారు. సాధారణంగానే పూరి జగన్నాధ్ సినిమాల్లో మహిళలను ప్రొజెక్ట్ చేసే విధానం, హీరో చేసే పనులపై అభ్యంతరాలు ఉంటాయి. 'ఇస్మార్ట్ శంకర్'లో ఆ డోస్ కాస్త ఎక్కువే పెంచాడు పూరి. విమర్శలు చేస్తున్న వారిపై హీరో రామ్ తనదైన శైలిలోరియాక్ట్ అయ్యారు.

    మనుషుల జీవితాలకు విలువ లేదు

    హీరో హెల్మెట్ పెట్టుకోలేదు... హీరో స్మోక్ చేస్తున్నాడు.. హీరో అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు.. ఎంతసేపూ ఇవేగానీ.. అక్కడ హీరో అడ్డమొచ్చిన వారిని చంపేస్తున్నాడని ఒక్కరు కూడా కంప్లయింట్ చేయడం లేదు. మనుషుల జీవితాలకు విలువ లేదు, ఇది చాలా బాధాకరం. ‘ఇస్మార్ట్ శంకర్' పెద్దలు మాత్రమే చూడగలిగే బద్దాస్ క్యారెక్టర్.. అంటూ రామ్ ట్వీట్ చేశారు.

    సూపర్ అంటూ పూరి రిప్లై

    సూపర్ అంటూ పూరి రిప్లై

    తమ సినిమాపై విమర్శలు చేస్తున్న వారికి రామ్ అదిరిపోయే రిప్లై ఇవ్వడంపై దర్శకుడు పూరి జగన్నాథ్ సంతోషం వ్యక్తం చేశారు. అదరగొట్టావ్ రామ్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. చాలా మంది సినిమాను సినిమాగా చూడకుండా అనవసరమైన విమర్శలు చేస్తున్నారు అనే అర్థం వచ్చేలా.... వ్యాఖ్యానించారు.

    ఫ్యాన్స్ ఏమంటున్నారు...

    నువ్వు పరిగెట్టి పాలు తాగితే సమాజం కుళ్లుకుంటుంది!! నువ్వు నిల్చుని నీళ్లు తాగితే సమాజం వెక్కిరిస్తుంది... ఇక్కడ సమాజంలో ఊగుతూ బీర్ తాగాలి, అవసరం లేకపోయినా గోడవపడాలి... చల్!! అంటూ కొందరు రామ్ చేసిన కామెంట్లకు తమ మద్దతు ప్రకటించారు.

    ఇస్మార్ట్ శంకర్

    ఇస్మార్ట్ శంకర్

    రామ్ సరసన నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నరు. పునీత్ ఇస్సార్‌, స‌త్య‌దేవ్‌, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను, సుధాంశు పాండే త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌, సాహిత్యం: భాస్క‌ర‌భ‌ట్ల‌, ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధికీ, ఆర్ట్‌: జానీ షేక్‌, సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌, మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌, నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్‌, ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌

    English summary
    "Hero helmet pettukoledhu.. Hero smoke chestunnadu.. Hero ammailaki respect ivvatledhu.. Entha sepu ivve gaani.. Akkada hero addamochinavaalani champestunaadu..ani okkallu kuda complain cheyadam ledhu.. No value for life! SAD! #iSmartShankar - “A” Badass fictional character." Ram Potineni tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X