10 రోజుల ముందు వస్తే ఆచార్య క్యారెక్టర్ నాదే అన్నారు.. మెగాస్టార్ అలా అనగానే షాక్: జబర్దస్త్ కమెడియన్

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పటికే సంక్రాంతికి రావాల్సిన పెద్ద సినిమాలు వరుసగా వాయిదా పడడంతో ఫిబ్రవరిలో రావాల్సిన ఆచార్య సినిమా కూడా అదే తరహాలో వాయిదా పడుతుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఆ విషయాన్ని పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి గురించి ఇటీవల ఒక జబర్దస్త్ కామెడీ అని చెప్పిమా విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

వరుసగా బిగ్ బడ్జెట్ మూవీస్

వరుసగా బిగ్ బడ్జెట్ మూవీస్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా బిగ్ బడ్జెట్ సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేని విధంగా చాలా బిజీ బిజీగా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. వరుసగా ఒకేసారి నాలుగైదు సినిమాలను లైన్ లో పెట్టడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఎంతో ఓపికగా ముందుకు వెళుతూ యువ దర్శకులకు కూడా అవకాశాలు ఇస్తున్నారు.

రామ్ చరణ్ పవర్ఫుల్ రోల్

రామ్ చరణ్ పవర్ఫుల్ రోల్

ఆచార్య సినిమాపై మెగా అభిమానులలో అంచనాలు మాములుగా లేవు. సినిమాలో రామ్ చరణ్ తేజ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఒక్కసారిగా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. రామ్ చరణ్ సిద్దా అనే పాత్రలో కనిపిస్తుండగా ఈ సినిమాలో ఆ పాత్రకు జోడీగా పూజా హెగ్డే కూడా మంచి క్యారెక్టర్ లో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

రిలీజ్ డేట్ ఫిక్స్

రిలీజ్ డేట్ ఫిక్స్

ఆచార్య సినిమాను ఈ ఏడాదిలోనే విడుదల చేయాలి.. కానీ కరోనా ప్రభావం వలన సినిమాను వాయిదా వేయక తప్పలేదు. ఈ సంక్రాంతికి రావాల్సిందే కానీ ముందుగా పెద్ద సినిమాలు స్లాట్ బుక్ చేసుకోవడంతో ఆచార్య సినిమా కూడా వాయిదా వేసుకోక తప్పలేదు. తప్పకుండా ఫిబ్రవరి 4న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మెగాస్టార్ చిరంజీవి నిర్మాతలతో చర్చించారు.

మెగాస్టార్ సపోర్ట్

మెగాస్టార్ సపోర్ట్

అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో నటించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది.. మెగాస్టార్ కూడా టాలెంట్ ఉన్న వారిని తన సినిమాల్లో కనిపించే విధంగా ప్రత్యేకంగా అవకాశాలు కూడా ఇస్తూ ఉంటారు. అవసరమైతే ఇతర సినిమాల్లో కూడా అవకాశం వచ్చేలా దర్శకులతో నిర్మాతలతో అలాగే హీరోలతో కూడా మాట్లాడుతూ ఉంటారు.

ముందే వస్తే ఆచార్య క్యారెక్టర్ వచ్చేది

ముందే వస్తే ఆచార్య క్యారెక్టర్ వచ్చేది

ఆచార్య సినిమాల్లో నటించాలని ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ ఎంతగానో ఆశ పడ్డాడట. అందుకోసం ఆచార్య సినిమా షూటింగ్ జరుగుతుండగా ఏదైనా చిన్న రోల్ ఉంటే ఇవ్వండి అని అడగగానే మెగాస్టార్ చెప్పిన సమాధానం అతని ఆశ్చర్యానికి గురి చేసిందట. కాస్త 10 రోజుల ముందు రకపోయావా ఆచార్య క్యారెక్టర్ నువ్వే వేసేవాడివి అని అన్నారట. అయితే మెగాస్టార్ చిరంజీవి అది చాలా సరదాగా నవ్వుకుంటూ చెప్పగానే కామెడీ టైమింగ్ కు మహేష్ షాక్ అయ్యాడట.

జబర్దస్త్ మహేష్..

జబర్దస్త్ మహేష్..

ఆ జబర్దస్త్ కమెడియన్ మరెవరో కాదు రంగస్థలం సినిమా లో రామ్ చరణ్ పక్కనే సపోర్టింగ్ రోల్ చేసి మహేష్. జబర్దస్త్ ద్వారా క్రేజ్ అందుకున్న మహేష్ ఆ తర్వాత అతను దాదాపు అందరు హీరోలతో కలిసి నటించాడు. ఇక మెగాస్టార్ సినిమాల్లో కూడా కనిపించాలని అనుకొని ఆచార్య లొకేషన్ లోకి వెళ్లగా మెగాస్టార్ చాలా సరదాగా మాట్లాడినట్లు తెలియజేశాడు. ఆయన కామెడీ టైమింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని రంగస్థలం సినిమాలో తను చేసిన పాత్రను కూడా చాలా మెచ్చుకున్నారు అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X