twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాళ్లు బ్రోకర్ పని చేసి కోట్లు సంపాదించారు... ప్రభాస్, తారక్ జెన్యూన్: జగపతి బాబు

    By Bojja Kumar
    |

    హీరోగా కెరీర్ ముగిసిన తర్వాత 'లెజెండ్' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి విలన్ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తున్న జగపతి బాబు ఇటీవల విడుదలైన 'గూఢచారి' సినిమాతో మరో విజయం తన ఖాతాలో వేసుకున్నారు. ఇటీవల ఆయన సక్సెస్ మీట్లో మాట్లాడుతూ ఇండస్ట్రీకి వచ్చి 30 సంవత్సరాలైందని, ఇలాంటి సమయంలో గూఢచారి సక్సెస్ రావడం ఆనందంగా ఉందని తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతి బాబు.... పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

    సమస్య లేకుండా జీవితం ఉండదు

    సమస్య లేకుండా జీవితం ఉండదు

    సమస్య లేకుండా ఎవరి జీవితం ఉండదు. నేనేదో కష్టపడ్డాను, సఫర్ అయ్యానని ఎప్పుడూ చెప్పుకోను. ఏదైనా సమస్య వచ్చినపుడు ఏం చేయాలి, ఎలా సర్వైవ్ అవ్వాలనే ఆలోచిస్తాను. దానికి బాధ పడిపోయి, ఏడ్చేసి డిప్రెషన్లోకి వెళ్లిపోయి మందుకొట్టే రకం నేను కాదు అన్నారు.

    లెజెండ్‌తో అంతా మారిపోయింది

    లెజెండ్‌తో అంతా మారిపోయింది

    నా విషయం తీసుకుంటే మొదట్లో జగపతి బాబు వేస్ట్ అని తేలిపోయింది. వరుసగా ప్లాపులు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని సినిమాలు ఆడాయి. లెజెండ్ ముందు అయితే నా కెరీర్ అయిపోయిందనే అంతా అనుకున్నారు. నేను కూడా ఇండస్ట్రీ నుండి ఔట్ అయినట్లే అనుకున్నాను. ఆ సమయంలో విలన్ పాత్రలు చేద్దామనుకున్నాను. చాలా కాలం వెయిట్ చేసినా ఏ మూవీ రాలేదు. ఇక ఆపర్చునిటీ లేదేమో అనుకున్నాను. ఆ సమయంలో లెజెండ్ వచ్చింది సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత అంతా మారిపోయింది.

    నిరాశ పడకూడదు

    నిరాశ పడకూడదు

    నా అనుభవంతో నేను చెప్పేది ఒకటే. జీవితంలో కష్టాలు అనేవి ఎక్స్‌పీరియన్స్ మాత్రమే. దానికి నేను అయిపోయాను. ఇది నాకే జరుగాలా? ఇంకోడైతే సూసూడ్ చేసుకుంటాడు? అని అనుకోవడం కాదు జీవితం. ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు తెరుచుకుంటుంది. బాల్ వచ్చినపుడే మనం క్యాచ్ చేయాలి. సమయం కోసం వెయిట్ చేయాలి. జీవితంపై నిరాశ పడొద్దు. ప్రతి ఒక్కడికీ టాలెంట్ ఉంటుంది. అది నిరూపించుకోవడానికి దారులు వెతుక్కోవాలి.

    అది తప్ప ఏదీ చేతకాదు

    అది తప్ప ఏదీ చేతకాదు

    జీవితం వేరు, సినిమా వేరు. సినిమాల్లో దాదాపు వందల రకాల క్యారెక్టర్లు చేశాను. ఎన్నో జీవితాలు చూశాను. సైడ్ లో నా జీవితం నేను చూసుకున్నాను. ఇండస్ట్రీలో అంత మ్యాజిక్ ఉంది. యాక్టింగ్ తప్ప ఏమీ చేయలేను.

    టాలెంట్ ఉండటమే ముఖ్యం

    టాలెంట్ ఉండటమే ముఖ్యం

    తెలుగువారికే అవకాశాలు ఇవ్వాలి అని నేను అనను. ఎందుకంటే నేను అన్ని భాషల్లో చేస్తున్నాను. పాత్రకు సరిపోయే వారు ఇక్కడ ఉంటే ఇవ్వాలి. వారు అనుకున్న పాత్రకు తగిన వారు లేనపుడు వేరే దగ్గర నుండి తెచ్చుకోక తప్పదు.

    రాజకీయాలు సూట్ కావు

    రాజకీయాలు సూట్ కావు

    రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదు. అవి నాకు సూట్ కాదు. కరప్షన్ ఉంటుంది, వేల మందిని కలవాలి, నాకు నలుగురిని కలవడమే కష్టం. అందరితో ఇమడలేను. డిప్లమాటిక్‌గా మాట్లాడటం, మాటలు కలపడం, కబుర్లు చెప్పడం నాకు రాదు. అందుకే పాలిటిక్స్‌లోకి వచ్చే ఉద్దేశ్యం లేదు.

    డబ్బే జీవితం కాదు

    డబ్బే జీవితం కాదు

    డబ్బు జీవితం కాదు. డబ్బు కోసం ఎన్నో నాటకాలు ఆడుతున్నాం. జీవితం ఎండ్ వరకు పరుగెడుతున్నాం. ఆ తర్వాత డబ్బు ఉంది కానీ జీవితం లేదు. వెల్త్ ఉంది కానీ హెల్త్ లేదు. అది కాదు ముఖ్యం. శ్రీమంతుడులో చెప్పినట్లు అందరూ బ్రతుకుతున్నా కానీ బతకడం లేదు.

    వాళ్లు బ్రోకర్ పని చేసి సంపాదించారు

    వాళ్లు బ్రోకర్ పని చేసి సంపాదించారు

    వందల కోట్లు సంపాదించిన వారు కొందరు నాకు తెలుసు. కానీ వాళ్లు వందల కోట్లు బ్రోకర్ పని చేసి సంపాదించారు. వాళ్ల మీద రెస్పెక్ట్ లేదు. వారి వద్ద వందకోట్లు ఉండొచ్చు. కానీ వారిని లెక్క చేయను. సమాజంలో ఉండాల్సింది అలాంటివారు కాదు. ప్రతి ఒక్కరూ ఒక చిన్న గోల్ పెట్టుకోవాలి. నాకు 30, 40 కోట్లు ఉంటే చాలు. నేను లైఫ్‌లో సెటిలైనట్లే. వాటితో సంతోషంగా ఉంటాను. కొంత మందికి వందల కోట్లు సంపాదించాలని పిచ్చి పట్టింది, దెయ్యం పట్టింది. అది ఒకటి మైండ్‌లో నుండి తీసేస్తే సంతోషంగా ఉంటాం.

    తారక్, ప్రభాస్ జెన్యూన్

    తారక్, ప్రభాస్ జెన్యూన్

    నేను ఎక్కువ మందితో కలవక పోవడానికి కారణం నాకు మాటలు కలవడం రాదు. నిజ జీవితంలో నటించడం నాకు నచ్చదు. చాలా మంది జెన్యూన్ పీపుల్ కూడా ఉన్నారు. వాళ్లతో కలుస్తాను. ప్రభాస్ స్వీట్ హార్ట్... ఎప్పుడూ కాల్ చేసినా బాగా రెస్పాండ్ అవుతాడు.. ఒక వేళ మిస్ అయితే వంద శాతం రిటర్న్ కాల్ చేస్తాడు. చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు. తనకు నచ్చినోళ్లతో చాలా బావుంటాడు. అలాగే తారక్ కూడా. వాళ్లకు ముందే చెబుతాను. నేను మీకు ఫోన్ చేయను.... మీరు షూటింగులో ఏ మూడ్లో ఉంటారో తెలియదు, మీరు సెలబ్రిటీలు కాబట్టి మిమ్మల్ని డిస్ట్రబ్ చేయను. మీరు చేయండి నేను వచ్చేస్తా మీ ఇంటికి అంటాను. అదే నేను ఫాలో అవుతాను.

    అందరూ హీరోగా చూస్తున్నారు

    అందరూ హీరోగా చూస్తున్నారు

    నాది సెకండ్ ఇన్నింగ్సా? హీరోనా? విలనా? అనే సంగతి పక్కన పెడితే.... అందరూ నన్ను హీరోను చూసినట్లే చూస్తారు. ఆర్టిస్టులైనా, టెక్నీషియన్లు, ప్రొడ్యూసర్లు అందరూ అలాగే చూస్తారు. హీరోగా కంటే ఇప్పుడే బావుంది. హీరోగా ఉంటే సినిమా బర్డెన్ నా మీద ఉంటుంది. ఇపుడు ఆ బర్డెన్ లేదు. ఆ తలనొప్పి లేదు కాబట్టి సంతోషంగా ఉంది. చేసుకుంటూ వెళ్లిపోతా. కొన్ని సినిమాలు ఆడిందా? లేదా? అనేది కూడా పట్టించుకోను. నా పని నేను పర్ఫెక్టుగా చేసుకుంటూ వెళ్లిపోతాను.

    English summary
    Tollywood actor Jagapathi Babu said Prabhas and NTR very close to him. Jagapati Babu is an Indian film actor known for his works predominantly in Telugu cinema. In a career spanning 25 years, Jagapati Babu has starred in over 120 feature films, and has received 3 Filmfare Awards and 7 state Nandi Awards.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X