రామ్ చరణ్ తీరుతో జగపతి బాబు ఆశ్చర్యం, వందల వందని ఎంతో జాగ్రత్తగా...
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'సై రా నరసింహారెడ్డి' చిత్రంలో ప్రముఖ నటుడు జగపతి బాబు కూడా భాగమైన సంగతి తెలిసిందే. ఇటీవల జార్జియా షూటింగులో పాల్గొన్న అనంతరం జగపతి బాబు ఈ చిత్ర నిర్మాత రామ్ చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'సైరా నరసింహారెడ్డి' షూటింగ్ జార్జియాలో జరిగినపుడు వందల మంది యాక్టర్లు పాల్గొన్నారు. ఇందులో జూనియర్ యాక్టర్ల దగ్గర నుంచి సార్ యాక్టర్ల వరకు ఉన్నారు. రామ్ చరణ ప్రతి ఒక్కరినీ ఎంతో బాగా చూసుకున్నారు అని జగపతి బాబు తెలిపారు.

యూనిట్ సభ్యుల్లో ప్రతి ఒక్కరికీ మంచి ఆహారం, మంచి వసతి కల్పించడంలో రామ్ చరణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వారికి మంచి రెమ్యూనరేషన్ ఇవ్వడంతో పాటు తనను, తన సినిమా నమ్మి వేరే దేశం వచ్చిన వారి ఆరోగ్యం విషయంలో కూడా చరణ్ కేర్ తీసుకున్నారు అని జగపతి బాబు తెలిపారు.
రామ్ చరణ్‌ను ఇప్పటి వరకు మంచి నటుడిగానే చూశాను, నిర్మాతగా అతడి పని తీరు చూసి ఇంప్రెస్ అయినట్లు వెల్లడించారు. సెట్లో అన్నీ పర్ఫెక్టుగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటారని ప్రశంసలు గుప్పించారు. సైరాలో కీలకమైన పాత్ర చేస్తున్న జగపతి బాబు సినిమాలో తన పాత్రకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.


Click it and Unblock the Notifications











