1000 కోట్ల ఆస్తి పోగొట్టుకున్న హీరో ఎవరో తెలుసా..?

Jagapathi Babu: టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు జగపతిబాబు. హీరోగా, విలన్‌గా ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతాడు. ఆయన కెరీర్‌లో ఎన్నో విజయాలు అపజయాలు చూశారు. ఆయన నట జీవితంలో ఏడు నంది అవార్డులు అందుకున్నారంటే.. ఆయన ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ హీరోగా ఎంటర్టైన్ చేసినా జగపతి బాబు.. సెకండ్ ఇన్నింగ్ లో లెజెండ్, రంగస్థలం, శ్రీమంతుడు చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఆస్తులపై జగపతి బాబు మాట్లాడుతూ..' సంపాదన పెరిగిన కొద్దీ ఇబ్బందులే తప్ప మనశ్శాంతి ఉండాలని, సంపాదన విషయంలో చాలామంది బ్యాలెన్స్ గా ఉండడం తెలియదని, ఆ బ్యాలెన్స్ లేదని చాలామంది ఇబ్బంది పడుతున్నారని జగపతి బాబు అన్నారు. ఆ బ్యాలెన్స్ లేని వ్యక్తుల్లో జగపతిబాబు మొదటి వారంటే మీరేమంటారని రిపోర్టర్ ప్రశ్నించగా.. డబ్బులు విషయంలో తాను జీరో నని, తాను డబ్బులు లెక్క చేయనని అన్నారు.

Jagapathi Babu Do you know who is the hero who lost 1000 crore property

తన ఆస్తులు ఎక్కిస్తే దాదాపు 1000 కోట్లు ఉండాలని, కానీ అంత డబ్బు తన దగ్గర లేకపోవడానికి సమాధానం చెప్పడం చాలా కష్టం అన్నారు జగపతిబాబు. కానీ మిగతా వాళ్ళు అనుకున్నట్లు తన గ్యాంబ్లింగ్లో లేదా అమ్మాయిల ఖర్చు పెట్టారని ప్రచారం చేయడం సరికాదన్నారు. తనకు క్యాసినో లలో ఆడటం తనకు వినోదమని, కానీ, దానివల్ల అంత మొత్తంలో డబ్బు పొడగట్టుకున్నాడని అబద్ధం అన్నారు.

కోట్ల రూపాయాల ఆస్తినీ కోల్పోవడం పై జగపతిబాబు మాట్లాడుతూ..'అది ఇవ్వడం వల్ల పోయిందో.. ఖర్చు పెట్టడం వల్ల పోయిందో.. లేదా ఇతరులు కొట్టేయడం వల్ల పోయిందో.. ఆస్తి అనేది ఎలా పోయిందనేది నాకు తెలియదు. ఈ విషయంలో తనని ఎవరు మోసం చేశారో వారి గురించి ఆలోచించను. దాని గురించి పట్టించుకోను. ఎవరినీ ఇందులో బ్లేమ్ చేయదలచుకోలేదు. తాను కొంచెం జాగ్రత్తగా ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు.

Jagapathi Babu Do you know who is the hero who lost 1000 crore property

అలాగే జగపతిబాబు ఓ బ్రోకర్ వల్ల మోసపోయాడు అనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది. ఈ విషయంపై జగపతిబాబు స్పందిస్తూ.. ఒక్కడిని కాదు చాలామంది ఉన్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. సంపాదన ఎలా కోల్పోయారని ప్రశ్నించగా.. తాను లెక్కలు సరిగా చూసుకోలేదు. ఈ విషయంలో తాను మోసపోయారంటారు లేదా నా చేతగానితనం అంటారు.. అది వారికి విడిచిపెడుతున్నాను పెడుతున్నాను. ఈ విషయంలో ఎవరిని తాను బ్లేమ్ చేయడం లేదన్నారు.

తన ఆస్తి ఎంత పోయిన తర్వాత 30 కోట్లు మిగిలిందని, ఆ డబ్బుతోనే తాను హ్యాపీగా ఉండొచ్చని భావించానన్నారు. నేను ఆస్తులు మిగిలించకపోవచ్చు గాని, ఆ డబ్బుతో నా కుటుంబం మొత్తం లైఫ్ లాంగ్ లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి సరిపోతుందని అన్నారు. ఈ విషయాన్ని తన పిల్లలకు కూడా చెప్పేశాననీ, లైఫ్‌ లాంగ్ సంతోషంగా ఉంటాం. కోట్ల ఆస్తులు ఉంటే సంతోషంగా ఉంటామనేదనే తప్పు జగపతి బాబు అన్నారు. ఎన్ని కోట్లున్నా కొవిడ్ టైంలో ఆక్సిజన్ లేక చనిపోయిన వారున్నారని గుర్తు చేశారు.

More from Filmibeat

Read more about: jagapathi babu tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X