జగపతిబాబు వీరంగం....శౌర్యతో సమాంతరం...

టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకూ స్టైలిష్ విలన్ క్యారెక్టర్స్ కు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిన సీనియర్ హీరో జగపతిబాబు, తన నెక్స్ట్ సినిమాలో ఢిపరెంట్ లుక్ లో జనాలకు వినోదం పంచబోతున్నాడట. నాగ శౌర్య హీరోగా నటిస్తున్న చిత్రంలో జగపతి బాబు క్యారెక్టర్ కూడా సమాంతరంగా ఉండబోతోందని తెలుస్తోంది.

పురాతన క్రీడగా పేరుగాంచిన విలువిద్య ఇతివృత్తంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగశౌర్య ఆర్చర్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న శౌర్య తన పాత్రకోసం 8 ప్యాక్స్ బాడీని సిద్ధం చేశాడు. ఇక అబ్బాయి ఫస్ట్ ఓ రేంజ్ లోనే ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిందని చెప్పాలి.

Jagapathi babu on par with Naga Shourya, to be seen as Sportsman

ఇక శౌర్యకు ధీటుగా జగపతి బాబు క్యారెక్టర్ ఉండబోతోందట. శౌర్యకు సమ ఉజ్జీగా కనిపించబోతున్న జగపతి బాబు కూడా ఈ సినిమా స్పోర్ట్స్ మ్యాన్ గా కనిపించబోతున్నాడట. అంతేకాదు, ఈ పాత్ర కోసం జగపతి బాబు పూర్తిస్థాయి మేకోవర్ కూడా చేయించుకోబోతున్నాడని వినిపిస్తోంది. అతడి లుక్స్ మరాఠీ యోధుడు ఛత్రపతి శివాజీరాజా పోలి ఉంటాయని తెలుస్తోంది.

ఇక సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శౌర్యకు జోడీగా కేతికా శర్మ నటిస్తోంది. శరత్ మారర్, నారాయణ్ దాస్ నారంగ్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 18నుంచి మళ్లీ రెగ్యలర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. మరి నాగశౌర్యతో సమానంగా, విలువిద్య నైపుణ్యాన్ని ప్రదర్శించబోతున్న జగపతి బాబు... తొలిసారి చేస్తున్న స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకులను ఏ రీతిన ఆకట్టుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X