Jagapathi Babu: బాలీవుడ్ బిగ్ బడ్జెట్ సినిమాలో జగ్గూభాయ్ పవర్ఫుల్ రోల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న జగపతి బాబు ఆ తర్వాత మార్కెట్ తగ్గిపోవడంతో మెల్లగా సపోర్టింగ్ పాత్రలతో మరో ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఒకవైపు సపోర్టింగ్ రోల్స్ చేసినప్పటికీ కూడా ప్రత్యేకంగా హీరోగా కూడా మరికొన్ని సినిమాలు చేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఆ సినిమాలు ఏవి కూడా ఆయనకు అనుకున్నంత స్థాయిలో మంచి విజయాలను అందించలేకపోయాయి. ఇక లాభం లేదని ఆయన ఒక్కసారిగా స్టైల్ చేంజ్ చేశారు. లెజెండ్ సినిమా నుంచి జగపతి బాబు సరికొత్త కెరీర్ ని మొదలు పెట్టారు అనే చెప్పాలి. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నందమూరి బాలయ్య హీరోయిజానికి పోటీగా జగపతిబాబు చూపించిన విలనిజం సినిమాకు ఎంతగానో హెల్ప్ అయ్యింది.

జగపతి బాబు అలాంటి పాత్రలో కనిపిస్తారని అంతకుముందు వరకు ఎవరూ ఊహించలేదు. పాజిటివ్ రోల్స్ లోనే కాకుండా నెగటివ్ రోల్స్ తో కూడా జగపతి బాబు సరికొత్త కిక్ ఇచ్చాడు అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత ఆయన కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఎలాంటి ఆఫర్స్ వచ్చినా కూడా పాత్రలో సరైన కంటెంట్ ఉంటేనే సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఒక విధంగా జగపతిబాబు ఎంచుకున్న పాత్రలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి అనే చెప్పాలి సినిమా సక్సెస్ అయినా కాకపోయినా కూడా ఆయన పాత్రలకు చాలా వరకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇక ప్రస్తుతం జగపతిబాబుకి తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంచి ఆఫర్స్ వస్తున్నాయి.

పెద్ద హీరోలతో కూడా ఆయన విలన్ గా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. వీలైనంత వరకు మంచి పాత్రలను ఆయన సెలెక్ట్ చేసుకుంటున్నారు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఒక సినిమా చేయడానికి ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. లాగాన్ ఫేమ్ అశుతోష్ గోవరికర్ తెరకెక్కిస్తున్న ఒక విభిన్నమైన సినిమాలో జగపతిబాబు నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. జావేద్ అక్తర్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఆ ఇంట్రెస్టింగ్ సినిమా లో పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా ప్రముఖ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం.

Jagapathi Babu powerful role in upcoming hindi project

ఇక ఇటీవల జగపతిబాబు మహాసముద్రం సినిమాలో చుంచు మామా అనే పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ జగపతిబాబు చేసిన పాత్రకు మాత్రం మంచి గుర్తింపు లభించింది. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సిద్ధార్థ్ శర్వానంద్ హీరోలుగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ అవుతుందని అందరూ ఎంతో నమ్మకంతో ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో అయితే క్లిక్ అవ్వలేదు. ఇక రావు రమేష్ చేసిన గూని బాబ్జి పాత్రకు కూడా మంచి గుర్తింపు లభించింది. ఇక జగపతి బాబు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి ఆఫర్స్ అందుకుంటున్నాడు. మరి ఇటీవల వచ్చిన ఆఫర్ తో హిందీలో ఆయన ఇంకా ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X