Sarkaru Vaari Paata నుంచి ఆ హీరో ఔట్: ఆయన స్థానంలో మరో స్టార్‌ను తీసుకున్న టీమ్
కొంత కాలంగా వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నాడు టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఇటీవలి కాలంలో 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి హ్యాట్రిక్ విజయాలను అందుకున్న ఈ స్టార్ హీరో.. ప్రస్తుతం కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాంతో 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తున్నాడు. బ్యాంక్ స్కాముల నేపథ్యంతో సాగుతూ ఫుల్ లెంగ్త్ కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' మూవీ నటించే నటీనటుల గురించి చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ, చిత్ర యూనిట్ నుంచి ఇందులో పలానా వాళ్లు నటిస్తున్నారన్న క్లారిటీ మాత్రం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా నెగెటివ్ రోల్ చేస్తున్నట్లు మొదట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన చేసేది విలన్ పాత్ర కాదని, ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ అని ఓ న్యూస్ తెగ చక్కర్లు కొట్టింది. అయితే, ఆ తర్వాత అసలు అర్జున్ ఇందులో ఎటువంటి పాత్రనూ పోషించడం లేదని ఓ న్యూస్ బయటకు వచ్చింది.
అసలు 'సర్కారు వారి పాట'లో అర్జున్ సర్జాను తీసుకున్నారా? లేదా? తీసుకుంటే ఆయన ఎందుకు సినిమా నుంచి తప్పుకున్నారు? అని చాలా రోజులుగా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ఓ న్యూస్ బయటకు వచ్చింది. అదే సమయంలో అదిరిపోయే అప్‌డేట్ కూడా వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. కోవిడ్ కారణంగా షూటింగ్‌లకు బ్రేక్ పడడంతో ముందుగా కమిట్ అయిన చిత్రాలకు అర్జున్ ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చిందట. అందుకే డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

'సర్కారు వారి పాట' మూవీలో అర్జున్ సర్జాతో చేయించాలనుకున్న పాత్ర కోసం ఎంతో మంది పేర్లను పరిశీలించిందట చిత్ర యూనిట్. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ హీరో కమ్ విలన్ జగపతిబాబును తీసుకున్నారని ఓ న్యూస్ తాజాగా ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. గతంలో మహేశ్ బాబుతో కలసి 'శ్రీమంతుడు', 'మహర్షి' వంటి చిత్రాల్లో నటించిన ఆయన.. ఆ తర్వాత 'సరిలేరు నీకెవ్వరు'లో కూడా నటించాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాల వల్ల అందులో చేయలేదు. ఇక, ఇప్పుడు మరోసారి మహేశ్, జగపతిబాబు స్క్రీన్‌ను పంచుకోబోతున్నారు.
భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' మూవీలో మహేశ్ బాబు క్లాస్, మాస్ లుక్స్‌లో కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో మహానటి కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటించబోతుంది. దీనికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇక, ఈ మూవీ నుంచి ఆగస్టు 9న పలు రకాల అప్‌డేట్స్ రాబోతున్నాయి.


Click it and Unblock the Notifications











