పవన్ కళ్యాణ్ న్యూ రికార్డ్.. ఆ విషయంలో సీఎం జగన్ కంటే ఎక్కువే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన ఎంచుకున్న మార్గం ఓ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఉహీంచని దెబ్బలు ఎన్నో భరించారు. ఓటమి కోలుకోలేని దెబ్బ కొట్టినప్పటికి రాజకీయాల్లో బలంగా నిలబడ్డారు. ఏ మాత్రం అలసట లేకుండా ఎప్పటిలానే ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఒక విషయంలో అధికార పక్ష నేత కంటే హై రేంజ్ లో ఉన్నాడు.

వెనకడుగు వేయకుండా..
జనసేన పార్టీని స్థాపించిన అనంతరం పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ మరింత పెడిగిందనే చెప్పాలి. రెగ్యులర్ రాజకీయాలు కాకుండా ప్రజా సమస్యలను బట్టి పోరాడుతు వస్తున్న పవన్ కళ్యాణ్ ఓ వర్గం ప్రజలను ఎంతగానో ఆకర్షించారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ దారుణంగా ఒడినప్పటికి ఆయన ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. మరింత బలంగా ముందడుగు వేసేందుకు కృషి చేస్తున్నారు.

పవన్ న్యూ రికార్డ్..
అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో అత్యదిక ఫాలోవర్స్ ని అందుకున్న సెలబ్రెటీలలో ఒకరిగా రికార్డు సృష్టించారు. ఓ విదంగా సీఎం జగన్ కంటే పవన్ కి ఎక్కువ మంది సపోర్ట్ ఉండడం విశేషం. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై ఎక్కువగా ట్విట్టర్ లోనే స్పందిస్తున్నారు. ఇటీవల వైఎస్ జగన్ చేప్పట్టిన 108 అంబులెన్స్ ర్యాలీపై కూడా పవన్ పాజిటివ్ గా స్పందించారు.

4 మిలియన్ ఫాలివర్స్..
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 4మిలియన్స్ దాటింది. కేవలం ఈ ఆరు నెలల్లోనే పవన్ కళ్యాణ్ అత్యదిక మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఇక మరోవైపు జన సైనికుల బలం పెరుగుతున్నందుకు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. మార్పు కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Recommended Video

జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువే..
ఇక ట్విట్టర్ లో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 1.6మిలియన్ ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంతకంటే ఎక్కువ స్థాయిలో 4 మిలియన్స్ ఫాలోవర్స్ ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక నెక్స్ట్ రాజకీయాల్లోనే కాకుండా పవన్ సినిమాలతో కూడా మళ్ళీ బిజీ కానున్నాడు. వకీల్ సాబ్ అనంతరం, క్రిష్, హరీశ్ శంకర్ వంటి వారితో సినిమాలను ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











