Jani Master హీరోగా రన్నర్.. మాస్ అవతారంలో పవర్‌పుల్ పోలీస్‌గా
దక్షిణాది చిత్ర పరిశ్రమలో టాప్ కొరియోగ్రాఫర్‌గా అగ్రహీరోలకు, బ్లాక్ బస్టర్ సాంగ్స్ కొరియోగ్రఫిని అందించిన జానీ మాస్టర్ హీరోగా పరిచయం కాబోతున్నారు. తెర వెనుక స్టార్ డ్యాన్సర్‌గా మెప్పించిన జానీ మాస్టర్ ఇక తెరపైన తన ప్రతిభను చాటుకోబోతున్నారు. జానీ మాస్టర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న రన్నర్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ రివీల్ పోస్టర్‌ను ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. జానీ మాస్టర్ నటిస్తున్న రన్నర్ సినిమా గురించిన వివరాల్లోకి వెళితే..
పోలీస్ బ్యాక్ డ్రాప్‌తో తండ్రి, కొడుకుల సెంటిమెంట్‌తో రన్నర్ సినిమాను తెరకెక్కించాం. ఈ సినిమాలో మంచి ఎమోషన్స్‌తోపాటు యాక్షన్ పార్ట్ కూడా ఉంటుంది. జానీ మాస్టర్ తన సినిమాకు కావాల్సిన విధంగా సాంగ్స్, కొరియోగ్రఫి కూడా ఉంటుంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

రన్నర్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే.. జానీ మాస్టర్ ఖాకీ ప్యాంట్ వేసుకొని పరుగులు పెట్టే సీన్ కనిపించింది. అలాగే ఖాకీ డ్రస్సులో మాస్ అవతారాన్ని కూడా మరో పోస్టర్‌లో చూపించారు. జానీ మాస్టర్ డ్రస్సు విషయానికి వస్తే.. ఓ వైపు ఖాకీ, మరో ఖద్దర్ కూడా ఉండటం సినీ అభిమానులకు ఆసక్తిని కలిగిస్తున్నది. ఫస్ట్ లుక్‌తోనే సినిమాకు అంచనాలు పెరిగాయి.
రన్నర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా చిత్రదర్శకుడు విజయ్ చౌదరి మాట్లాడుతూ.. మా హీరో, డ్యాన్సింగ్ స్టార్ జానీ మాస్టర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనతో సినిమా చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. జానీ గారి నటన, ఆయన క్యారెక్టరైజేషన్, కథలో తండ్రి కుమారుల మధ్య సెంటిమెంట్ సీన్స్ హైలైట్ అవుతాయి. ఇదొక డిఫరెంట్ థ్రిల్లర్ సినిమా. మణిశర్మ గారు అద్భుతమైన బాణీలు అందిస్తున్నారు. ఆయన ఇచ్చిన ట్యూన్లకు జానీ మాస్టర్ వేసే స్టెప్పులు అదిరిపోతాయి. ఇతర నటీనటులు, మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తాం అని చెప్పారు.

చిత్ర నిర్మాతలు విజయ భాస్కర్, జి. ఫణీంద్ర, ఎం. శ్రీహరి మాట్లాడుతూ .. జానీ మాస్టర్ గారికి హ్యాపీ బర్త్ డే. మా దర్శకుడు విజయ్ చౌదరి మంచి కథ రాశారు. స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా క్లారిటీతో చేశారు. హైదరాబాద్ నగరంలో కొన్నాళ్ళ క్రితం జరిగిన వాస్తవ ఘటనలు, సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేయడానికి సన్నాహాలు చేశాం అని చెప్పారు.
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయ్ చౌదరి
నిర్మాతలు: విజయ భాస్కర్, జి. ఫణీంద్ర, ఎం. శ్రీహరి
సినిమాటోగ్రఫి: పీజీ విందా
సంగీతం: మణిశర్మ
నిర్మాణ సంస్థ: విజయ ఢమరుక ఆర్ట్స్
పీఆర్వో : పులగం చిన్నారాయణ
డిజిటల్ మీడియా ప్రమోషన్స్: టాక్ స్కూప్


Click it and Unblock the Notifications











