twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Prince Release: జాతిరత్నాలు డైరెక్టర్ నుంచి మరో సినిమా రెడీ.. రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే?

    |

    జాతి రత్నాలు సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతకు ముందు వరకు ఆచిత్ర దర్శకుడు అనుదీప్ కేవీ అంటే పెద్దగా ఎవరికి తెలియదు. కానీ జాతిరత్నాలు సినిమా ప్రమోషన్స్ లో అతనికి మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా క్యాష్ షోలో అనుదీప్ కనిపించిన విధానం ఎంతోమందిని అట్రాక్ట్ చేసింది. అతని కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉండడంతో జాతి రత్నాలు సినిమాకు అది చాలా బాగా హెల్ప్ అయ్యింది.

    ఇక జాతి రత్నాలు సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక రేంజ్ లో సక్సెస్ అయింది. పెట్టిన పెట్టుబడికి ఆ సినిమా మూడింతల లాభాలను కూడా అందించింది. అయితే ఇప్పుడు దర్శకుడు అనుదీప్ మరొక సినిమాతో సిద్ధమయ్యాడు. అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న ప్రిన్స్ సినిమా విడుదల తేదీని కూడా ఫిక్స్ చేసుకుంది. సురేష్ బాబు, సునీల్ నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అయితే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

    Jathi Ratnalu director anudeep Kv upcoming movie prince release date

    ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ప్రిన్స్ సినిమా తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే పలు సినిమాలతో భారీ స్థాయిలో మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న శివకార్తికేయన్ ఇప్పుడు ఈ సినిమాతో కూడా భారీ స్థాయిలో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక అనుదీప్ జాతి రత్నాలు సినిమాతో తెలుగులో మంచి గుర్తింపును అందుకోగా ఇప్పుడు వీరి కలయికలో రాబోతున్న సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడుతున్నాయి.

    మొత్తానికి సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టాలి అని చిత్ర యూనిట్ సభ్యులు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కొన్ని సాంగ్స్ కు మంచి గుర్తింపు లభించింది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

    English summary
    Jathi Ratnalu director anudeep Kv upcoming movie prince release date
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X