టాలీవుడ్ పై జయసుధ సంచలన వ్యాఖ్యలు.. కుక్కలకు కూడా స్పెషల్ రూమ్స్ అంటూ!
టాలీవుడ్ లో సుదీర్ఘ కాలంగా నటిస్తున్న జయసుధ సహజనటిగా పేరు తెచ్చుకున్నారు. హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆమె అనేక సినిమాల్లో నటించింది. తెలుగు హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకున్న ఆమె చాలా ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి హీరోలతో కూడా నటించింది. అయితే ఆమె ఎందుకో స్టార్ హీరోయిన్ గా మాత్రం నిలదొక్కుకోలేక పోయింది. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు సాధించిన ఆమె తాజా ఇంటర్వ్యూలో కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. అ వివరాల్లోకి వెళితే..

50 ఏళ్లు
కేవలం పద్నాగేళ్ల వయసులో నటిగా సినీరంగ ప్రవేశం చేసిన జయసుధ ఇండస్ట్రీకి వచ్చిన 50 ఏళ్లు పూర్తవుతుంది. ఈ 50 ఏళ్లకు సినీ ప్రస్థానంలో అనేక రకాల పాత్రలు పోషించి ఆమె తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారని చెప్పక తప్పదు., హీరోయిన్ గా అవకాశాలు తగ్గాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నిలదొక్కుకుంది. అయితే గత కొన్నిరోజులుగా ఆమె వెండితెరకు దూరంగా ఉంటున్నారు. సూపర్ స్టార్ మహేష్‌బాబు 'మహర్షి', బాలకృష్ణ 'రూలర్' సినిమాల తర్వాత జయసుధ సినిమాల్లో కనిపించడం లేదు.

అవమానాలు తప్పలేదని
ఇక సినిమా పరిశ్రమలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌లో హీరోహీరోయిన్ల మధ్య వివక్ష ఉంటుందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మన తెలుగులో తెలుగు హీరోయిన్లను చిన్నచూపు చూస్తారని, అదే బాలీవుడ్ నుంచి ఏ హీరోహీరోయిన్ వచ్చిన వారికి చాలా ప్రాముఖ్యత ఇస్తారని ఆమె చెప్పుకొచ్చారు. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన తనకు కూడా ఇక్కడ అవమానాలు తప్పలేదని ఆమె బయట పెట్టారు.

మరీ చిన్నచూపు
అంతే కాక ఆమె మాట్లాడుతూ నటిగా 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నానని, ఇన్నేళ్లు పూర్తి చేసుకున్నందుకు బాలీవుడ్‌లో అయితే సన్మానాలు చేసేవారు లేదంటే కనీసం ఫ్లవర్ బొకే అయినా పంపించేవారని అన్నారు. అయితే ఇక్కడ తెలుగులో అది కూడా ఉండదని ఆమె విమర్శించారు. బాగా సక్సెస్ అయిన పెద్ద హీరోలను ఒకలా, చిన్న హీరోలను ఒకలా చూస్తారు కానీ ఇక్కడి హీరోయిన్లను మాత్రం మరీ చిన్నచూపు చూస్తారని అన్నారు.

ఎక్కువ చేస్తుంటారని
ఒకవేళ ముంబై నుంచి ఏ హీరోయిన్ వచ్చినా వారి కుక్కపిల్లకు కూడా స్పెషల్ రూం ఇస్తారు అంటూ జయసుధ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే హీరోలు కూడా ఇలానే ఉంటారా? అని ఆమెను ప్రశ్నిస్తే . వాళ్లది ఏం ఉండదని, పక్కన ఉండేవాల్లే ఎక్కువ చేస్తుంటారని ఆమె తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

సినీ వర్గాల్లో కలకలం
అంతేకాక ఒకవేళ పెద్ద హీరో డాన్స్ సరిగా చేయలేకపోతే.. హీరోయిన్ల దగ్గరికి వచ్చి ఏంటీ మీరు మూమెంట్ సరిగా చేయడం లేదని అడుగుతారని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాక పద్మశ్రీకి బాలీవుడ్ హీరోయిన్లు మాత్రమే అర్హులా.. తెలుగు హీరోయిన్లకు ఆ అర్హత ఉండదా? అని కూడా ఆమె ప్రశ్నించారు. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలుగు సినీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.


Click it and Unblock the Notifications











