విషప్రయోగం నిజంగానే జరిగిందా? క్లారిటీ ఇచ్చిన జేడీ చక్రవర్తి!
టాలీవుడ్‌లో విశిష్ట నటుడిగా గుర్తింపు పొందిన నటుడు జె.డి. చక్రవర్తి (JD Chakravarthy). హీరోగా, డైరెకర్ట్ గా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. కెరీర్ ప్రారంభంలోనే పలు హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జేడీ వర్తి, తన నటనతో ప్రత్యేక ముద్ర వేశారు. అయితే.. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఆయనపై "విష ప్రయోగం" జరిగిందంటూ వస్తున్న ప్రచారం తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే ఈ రూమర్స్‌పై తాజాగా స్పందించిన జేడీ చక్రవర్తి, అసలు నిజాన్ని బయటపెట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
జేడీ చక్రవర్తి సినీ ప్రయాణం చాలా వైవిధ్యంగా సాగింది.రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ (Shiva)తో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. తర్వాత విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గులాబీ లో ప్రేమికుడిగా, సత్య లో గ్యాంగ్‌స్టర్‌గా, కంపెనీ వంటి చిత్రాల్లో తన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తెలుగు మాత్రమే కాదు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా తన ప్రతిభను చాటుకున్నారు.ప్రస్తుతం జేడీ చక్రవర్తి తన సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా కొత్త తరహా పాత్రలను ఎంచుకుంటున్నారు.

తాజాగా ఆయన నటిస్తున్న సినిమా గాయపడ్డ సింహం(Gayapadda Simham). ఈ సినిమాలో ఆయన 'బ్రూటల్ ధర్మ'అనే పాత్రలో కనిపించనున్నారు. పేరు వినగానే సీరియస్‌గా అనిపించినా, ఇందులో హ్యూమర్ టచ్ కూడా ఉండటం ప్రత్యేకతగా నిలుస్తోంది. రియలిస్టిక్ కామెడీతో పాటు యాక్షన్ కలిసిన ఈ పాత్ర ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని జేడీ భావిస్తున్నారు. ఈ సినిమాలో జేడీతో పాటు తరుణ్ భాస్కర్,ఫరా అబ్దుల్లా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇంకా ఒక మిస్టరీ హీరో కూడా సినిమాలో ఉన్నాడని, ఆ సస్పెన్స్‌ను థియేటర్లలోనే రివీల్ చేస్తామని జేడీ తెలిపారు. ఈ కాంబినేషన్ ఇప్పటికే ఇండస్ట్రీలో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా 2026 మే 1న కార్మిక దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా జేడీ ఇస్తున్న ఇంటర్వ్యూలు సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. తనపై విషప్రయోగం జరిగిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. యూట్యూబ్ థంబ్‌నైల్స్, సోషల్ మీడియా వ్యూస్ కోసం కొందరు అతిశయోక్తిగా ఈ కథనాలను సృష్టిస్తున్నారని తెలిపారు. 'నా మీద విషప్రయోగం జరిగిందని ప్రచారం చేస్తున్నారు. కానీ అది పూర్తిగా అబద్ధం. కేవలం క్లిక్స్ కోసం క్రియేట్ చేసిన స్టోరీలు మాత్రమే' అని జేడీ క్లియర్‌గా చెప్పారు. అదే సమయంలో మీమ్స్ క్రియేటర్లను విమర్శించకుండా, వాళ్లు క్రియేటివ్‌గా ఆలోచిస్తారని ప్రశంసించడం ఆయన ప్రత్యేకతను మరోసారి చూపించింది.
తనపై వచ్చిన నెగటివ్ ప్రచారాన్ని కూడా చాలా లైట్‌గా తీసుకోవడం జేడీ స్టైల్. చాలామంది సెలబ్రిటీలు ఇలాంటి వార్తలపై తీవ్రంగా స్పందిస్తుంటే, జేడీ మాత్రం చాలా సరదాగా తీసుకోవడం విశేషం. 'ఇలాంటి వార్తలు నాకు పెద్దగా ప్రభావం చూపవు. నేను నా పని చేసుకుంటూ వెళ్లిపోతాను' అన్న ఆయన మాటలు ఆయన మానసిక స్థైర్యాన్ని తెలియజేస్తాయి. మొత్తంగా.. విషప్రయోగం వార్తలపై స్పష్టత ఇచ్చాడు జేడీ చక్రవర్తి.


Click it and Unblock the Notifications