అదిరిపోయే కాన్సెప్ట్.. అక్కడ జేడీ చక్రవర్తి సత్తా
శివ సినిమాతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు జేడీ చక్రవర్తి. హీరోగా ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన జేడీ చక్రవర్తి.. ఆ తరువాత విలన్ వేషాలతోనూ దుమ్ములేపేశాడు. దర్శకత్వంలోనూ జేడీ చక్రవర్తికి మంచి ప్రావీణ్యం ఉంది. అయితే ఈ మధ్య మాత్రం జేడీ చక్రవర్తి హీరోగా పలకరించి చాలా కాలమే అయింది. ఈ క్రమంలో జేడీ చక్రవర్తి హీరోగా ఎంఎంఓఎఫ్ ( MMOF) సినిమా ఓటీటీలో రిలీజైంది.
జేడీ చక్రవర్తి హీరోగా ఆర్ ఆర్ ఆర్ ప్రొడక్షన్స్ అండ్ జె కే క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి అనుశ్రీ సమర్పణలో రాజశేఖర్,ఖాసీం లు నిర్మించిన చిత్రం ఎంఎంఓఎఫ్. ఎన్ ఎస్ సి దర్శకత్వం వహించగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. మంచి వ్యూస్‌తో దూసుకుపోతన్న ఈ సినిమాపై చిత్రయూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేసింది. థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కిన జేడీ చక్రవర్తి కథానాయకుడు గా నటించిన ఈ సినిమా లో ధియేటర్ నడుపుకునే ఓ వ్యక్తి ఆ థియేటర్లో అడల్ట్ సినిమాలు నడుపుకుంటూ ఉంటాడు.

అలా ధియేటర్‌కి వచ్చిన వాళ్ళు చనిపోతూ వుంటారు.. అసలు వీళ్ళు చనిపోవడానికి, ధియేటర్‌కి, ఆ అడల్ట్ సినిమాలకి ఉన్న సంభందం ఏమిటి అన్నది సినిమా కథ. ఇలా కథపై ఆసక్తిని కలిగించేలా కట్ చేసిన టీజర్, ట్రైలర్ బాగానే క్లిక్ అయింది. ఇప్పుడు సినిమాకు కూడా బాగానే వ్యూస్ వస్తున్నాయి. ఈ క్రమంలో నిర్మాతలు మాట్లాడుతూ.. ప్రేక్షకులు కోరుకునే అన్నీ అంశాలు సినిమాలో ఉన్నాయి, తప్పకుండా ఈ సినిమాని చూడండి అని కోరారు.


Click it and Unblock the Notifications











