హీరోయిన్‌తో కాదు.. ఆమె తల్లితో లవ్‌లో పడ్డా.. ఆ విషయంలో డైరెక్టర్‌ను కొట్టలేదు.. జేడీ చక్రవర్తి
విభిన్నమైన పాత్రలు, విలక్షణమైన నటనతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకొన్న జేడీ చక్రవర్తి గత కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రాశి కంటే వాసి ముఖ్యం అనే విధంగా మూవీస్‌ను ఎంపిక చేసుకొంటూ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన 70MM అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..

సినిమా కథల్లో జోక్యం గురించి
సినిమా కథల్లో జోక్యం చేసుకొంటారనే ఆరోపణలు అవాస్తవం. సినిమా కథలో ఇన్‌వాల్వ్ అవుతాను గానీ.. జోక్యం చేసుకోను. డైరెక్టర్‌తో ఉండే రిలేషన్ వల్ల బెటర్‌మెంట్ కోసం సీన్‌లో గానీ, కథలో గానీ జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగానీ నా అంతటా నేను ఎలాంటి జోక్యం చేసుకోను అని జేడీ తెలిపారు.

ప్రతీ హీరోయిన్‌తో లవ్‌లో పడుతా
ఇక ప్రతీ సినిమా షూటింగ్ సమయంలో నేను ప్రతీ హీరోయిన్‌తో లవ్‌లో పడుతాను. ఏదో ఒక హీరోయిన్‌తో లవ్‌లో పడ్డారనేది సరికాదు. నాతో నటించిన హీరోయిన్లందరితోనూ నేను హ్యాపీగానే ఉంటాను. వారికి నేను ప్రేమిస్తున్నాననే విషయాన్ని ఏదో విధంగా తెలియజేస్తాను అంటూ జేడీ పేర్కొన్నారు.

శ్రీదేవి సినిమా షూటింగులో
రాంగోపాల్ వర్మ నిర్మించిన శ్రీదేవి అనే సినిమా హీరోయిన్‌తో లవ్‌లో పడలేదు. ఆ విషయంలో ఎలాంటి గోడవలు జరగలేదు. ఆ హీరోయిన్‌తో కాకుండా ఆమె తల్లిని ప్రేమించాను. ఆ విషయం ఎవరికీ తెలియదు. ఇక ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది అంటూ జేడీ అసలు విషయం బయటపెట్టారు.

నా వల్ల ఆగిపోలేదు అంటూ
శ్రీదేవీ అనే సినిమా షూటింగ్ నా వల్ల ఆగిపోలేదు. డైరెక్టర్‌కు, రాముకు ఏవో సమస్యలు ఉండి ఆ సినిమా ఆపేశారు. ఆ సినిమా షూటింగులో నేను కొట్టడం వల్లే డైరెక్టర్ తప్పుకొన్నారనే విషయం అబద్ధం. ఇలాంటి వార్తలు ఎలా పుడుతాయో అర్ధం కాదు అని జేడీ తెలిపారు.

జేడీ చక్రవర్తి కెరీర్
శివ, సత్య లాంటి చిత్రాలతో సుపరిచితులైన జేడీ చక్రవర్తి కెరీర్ విషయానికి వస్తే.. 2019 తర్వాత పెద్దగా సినిమాలు రిలీజైన దాఖలాలు లేవు. హిప్పి, మైఖేల్, కాంట్రాక్టు, పట్టారై చిత్రాలు విడుదల అయ్యాయి. తమిళ, తెలుగు, కన్నడ చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా 70ఎంఎం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.


Click it and Unblock the Notifications











