Love Story హీరోయిన్‌తో ట్రాయంగిల్ లవ్ స్టోరీ.. డైరెక్టర్, హీరో కొట్టుకొనేంతగా గొడవలు!
సినిమా పరిశ్రమలో హీరో, హీరోయిన్ మధ్య గొడవలు, లేదా హీరోయిన్లతో డైరెక్టర్లు, నిర్మాతలతో అఫైర్లు సాగడం సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి. అయితే కొన్ని ప్రేమలు పెళ్లిళ్ల వరకు వస్తే.. మరికొన్ని బ్రేకప్‌తోనే ఆగిపోతాయి. కొన్ని బయటకు తెలిసి మీడియాలో హల్ చల్ చేస్తే.. మరికొన్ని గుట్టు చప్పుడుగా ఉండిపోతాయి. ఒక యంగ్ హీరోయిన్‌ను ఒకరికొకరు తెలియకుండా ప్రేమలో పడి.. ఓ హీరో, డైరెక్టర్ చివరకు తీవ్రమైన గొడవల వరకు వెళ్లిన ఈ వ్యవహారం ఆసక్తికరంగా ఉంది. స్వయంగా ఆ హీరోనే బయటపెట్టిన వీడియో ఒకటి ట్రెండింగ్ అవుతున్నది. ఈ ట్రెండింగ్ న్యూస్ వివరాల్లోకి వెళితే..
తెలుగు సినిమా పరిశ్రమలో సంచలన విజయం సాధించిన చిత్రాల్లో ఒకటి గులాబీ. దర్శకుడిగా మారి కృష్ణవంశీ చేసిన మొదటి చిత్రంలో జేడీ చక్రవర్తి హీరోగా నటించాడు. శ్రీదేవీ సోదరి మహేశ్వరి నటించిన ఆ సినిమా భారీ విజయాన్ని అందుకొన్నది. ఈ సినిమా అమితాబ్ బచ్చన్ సొంత బ్యానర్ ఏబీసీఎల్‌లో హిట్ సినిమాగా నిలిచింది.

అయితే ఈ సినిమా షూటింగ్ అరకు ప్రాంతంలో జరిగింది. హీరో, హీరోయిన్లు జేడీ, మహేశ్వరిపై చిత్రీకరించిన పాట మేఘాలలో తేలిపోమన్నది.. కుర్రకారును కిరాకెత్తించింది. అయితే ఆ సినిమా షూటింగులో హీరో, హీరోయిన్లు నిజంగా ప్రేమలో పడ్డారనే విషయం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే వారిద్దరి ప్రేమ మాత్రం వార్తల వరకే ఆగిపోయింది. పెళ్లి వరకు రాలేకపోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి.
గులాబీ సినిమా సమయంలో తాను మహేశ్వరితో ప్రేమలో పడిన విషయం నిజమే. అయితే అదే సమయంలో డైరెక్టర్ కృష్ణవంశీ కూడా లవ్ చేశాడు. తొలుత మేమిద్దరం ఆమెను ప్రేమిస్తున్న విషయం మాకు తెలియదు. ఆమె కోసం గిప్టులు ఇస్తూ రకరకాలుగా ప్రపోజ్ చేసే ప్రయత్నాలు చేశాం అని హీరో జేడీ చక్రవర్తి చెప్పారు.

మహేశ్వరితో తాను ప్రేమలో ఉన్నానని కృష్ణవంశీకి తెలిసిన తర్వాత నాపై కోపం పెంచుకొన్నారు. మా ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయి. మా మధ్య ఫైట్స్ బాగానే జరిగాయి. అయితే మేమిద్దరం మంచి స్నేహితులమే. అయితే ప్రేమ వివాహానికి మహేశ్వరి ఫ్యామిలీ మెంబర్స్ అభ్యంతరం వ్యక్తం కావడంతో మా లవ్ అఫైర్ అక్కడే ఆగిపోయింది అని జేడీ చక్రవర్తి తెలిపారు.


Click it and Unblock the Notifications











