హీరోయిన్‌పై బడా ప్రొడ్యూసర్ దారుణం.. ఆ పరిస్థితి చేస్తే కన్నీళ్లు ఆగలేదు..

తెలుగు సినీ పరిశ్రమలో మహిళల భద్రత, అవకాశాలు, తెరవెనుక జరిగే వేధింపులు ఎప్పుడూ చర్చనీయమే. ఇటీవల తెలుగు అమ్మాయిలు ఎక్కువగా సినిమాల్లోకి రావాలని, ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని కొందరు సినీ ప్రముఖులు పిలుపునిస్తున్నారు. అయితే.. మరోవైపు ఇండస్ట్రీలో ఆడవారు ఎదురయ్యే ఇబ్బందులు, జరుగుతున్న దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. అలాగే, అప్పుడప్పుడూ ఇండస్ట్రీపై ప్రముఖుల ఆరోపణల కూడా ఆందోళన కలిగిస్తుంటాయి. అలా తాజాగా సీనియర్ నటుడు, దర్శకుడు జే.డీ. చక్రవర్తి (J.D.Chakravarthy) గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే?

నటుడు జే.డీ.చక్రవర్తి.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నటుడిగా, విలన్ గా తనకంటూ ఒక భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన. అలాగే.. టాలీవుడ్‌లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న క్యాస్టింగ్ కౌచ్, అవకాశాల పేరుతో వేధింపులు, పవర్ సెంటర్ల ఒత్తిడి వంటి అంశాలపై ఆయన బహిరంగంగా మాట్లాడారు. మహిళలు, ముఖ్యంగా కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే అమ్మాయిలు ఎదుర్కొనే ఒత్తిడులు ఎలా ఉంటాయో తన అనుభవంతో వివరించారు. హీరోయిన్లు ఇష్టపడి అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లరని, చాలా సందర్భాల్లో పరిస్థితులే వారిని అలా నెట్టేస్తాయని ఆయన పేర్కొన్నారు.

JD Chakravarthy Throwback Interview on Casting Couch Shocks Tollywood Again

జేడీ చక్రవర్తి చెప్పిన ఓ సంఘటన చర్చనీయంగా మారింది. ఓ ఇంటర్వ్యూలో హీరో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీలో కొత్తగా అడుగుపెట్టిన రోజుల్లో జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నారు. 'ఆ సమయంలో నేను చిన్న విలన్ పాత్రలు చేస్తున్నాను. నాకు ఓ హీరోయిన్ మంచి స్నేహితురాలు. ఒకరోజు ఆమె గెస్ట్ హౌస్‌లో ఉంటూ నన్ను, నటుడు సురేష్ ను డిన్నర్‌కు పిలిచింది. మేమిద్దరం మంచి స్నేహితులమే కాబట్టి కలిసి అక్కడికి వెళ్లాం'అని తెలిపారు.

ఇద్దరూ గెస్ట్ హౌస్‌కు వెళ్లి కూర్చున్న కొద్ది సేపటికే రాత్రి సమయంలో కాలింగ్ బెల్ మోగిందని చెప్పారు. మొదట ఫుడ్ ఆర్డర్ వచ్చిందేమోనని ఆ హీరోయిన్ కిటికీలోంచి చూసిందని, వెంటనే టెన్షన్ పడుతూ "మీరిద్దరూ వెంటనే మంచం కింద దాక్కోండి" అని చెప్పిందని జేడీ వెల్లడించారు. కారణం అడిగినా ముందుగా దాక్కోమని చెప్పడంతో మేము అలాగే చేశామని అన్నారు.

కొద్దిసేపటికే అక్కడికి ఓ నిర్మాత వచ్చాడని, ఆయన వయసు ఆ హీరోయిన్ తాత వయసులో ఉంటుందని చెప్పారు. తాము మంచం కింద దాక్కుని ఉన్నప్పటికీ, ఆ వ్యక్తి మాట్లాడుతున్న తీరు చాలా దారుణంగా ఉందని జేడీ పేర్కొన్నారు. నిర్మాత వెళ్లిపోయిన తర్వాత తాము బయటకు వచ్చామని, ఆ హీరోయిన్ మాత్రం నవ్వుతూ కనిపించిందని చెప్పారు. కానీ ఆమె నవ్వు వెనుక ఉన్న బాధను తాము అర్థం చేసుకున్నామని అన్నారు. ఆమె ఆ సమయంలో చెప్పిన మాటలు తమను కలచివేశాయని జేడీ గుర్తుచేశారు. "అతను ముసలోడు.. వాడి దగ్గర నుంచి భరించలేని వాసన వస్తోంది. అయినా ఏం చేస్తాం.. అతను పెద్ద నిర్మాత కదా.. తప్పదు" అని ఆమె చెప్పిందని వెల్లడించారు. ఆ మాటలు విన్నప్పుడు తాము ఇద్దరం కళ్లలో నీళ్లు వచ్చాయని అన్నారు.

ఈ సంఘటనను ఉదాహరణగా చెబుతూ జేడీ చక్రవర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. "ఏ అమ్మాయి కూడా ఇష్టపడి అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లదు. అవకాశాలు, అవసరాలు, పరిస్థితులే వారిని అలా నెట్టేస్తాయి" అని అన్నారు. చాలాసార్లు బయటకు కనిపించేది వేరేలా ఉన్నా, వాస్తవం మాత్రం వేరేలా ఉంటుందని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. కొంతమంది నటీమణులు కెరీర్ కోసం, అవకాశాల కోసం బలవంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు. "అది వాళ్ల ఇష్టం కాదు.. పరిస్థితుల ఒత్తిడి" అని స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో పవర్ ఉన్నవారు తమ ప్రభావాన్ని ఉపయోగించి కొందరిపై ఒత్తిడి తీసుకురావడం జరుగుతుందని కూడా సూచించారు. ప్రస్తుతం జేడీ చక్రవర్తి చేసిన పాత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X