‘ ఆ హీరోయిన్ తొడలంటే జేడీ చక్రవర్తికి పిచ్చి.. అర్ధరాత్రుళ్లు ఆ పనిచేయాల్సిందే ’

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి వచ్చిన వారు ఇప్పుడు వెండితెరపై వెలిగిపోతున్నారు. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నటీనటులు , ఇతర సాంకేతిక నిపుణులు వర్మ ఫ్యాక్టరీలో తయారైన వారే. ఇలాంటి వారిలో జేడీ చక్రవర్తి కూడా ఒకరు. హీరోగా , విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, డైరెక్టర్‌గా ఆయన టాలీవుడ్‌పై చెరగని ముద్ర వేశారు. తన నవ్వుతో అమ్మాయిలకు ఫేవరేట్ హీరోగా నిలిచిపోయారు. అలాంటి హీరోకి ఓ హీరోయిన్ అంటే పిచ్చి అట.

తెలుగు చిత్ర పరిశ్రమ గతిని మార్చిన శివ సినిమా ఎందరికో బ్రేక్ ఇచ్చింది. అలా సక్సెస్ కొట్టిన వారిలో జేడీ చక్రవర్తి కూడా ఒకరు. ఈ సినిమాతోను తెలుగు తెరకు పరిచయమైన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. ప్రేమ కథలతో పాటు మాఫియా, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. మనీ, రక్షణ, వన్ బై టూ, అనగనగా ఒక రోజు, గులబీ, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా, సత్య, ప్రేమకు వేళాయెరా తదితర చిత్రాలతో దూసుకొచ్చారు. దర్శకుడిగా హోమం, సిద్ధం వంటి చిత్రాలతో సత్తా నిరూపించుకున్నారు.

jd chakravarthy went middle of the night to see the heroine cutout

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నేటికీ డిఫరెంట్ సినిమాలు చేస్తూ వినోదాన్ని పంచుతున్నారు. ఓటీటీల రాకతో జేడీ చక్రవర్తి వంటి నటులకు మంచి అవకాశాలు దక్కుతున్నాయి. గతేడాది ఆయన నటించిన దయా వెబ్ సిరీస్ ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుంది. గత మార్చిలో విడుదలైన రా రాజా అనే డిఫరెంట్ మూవీతో మరోసారి షాకిచ్చారు జేడీ చక్రవర్తి. కేవలం కథ, కథనాల మీదే నడిచే ఈ సినిమాలో ఆర్టిస్టుల మొహలు కనిపించకుండా సినిమా తీశారు. మొహాన్ని చూపించకుండా భయపెట్టడం మామూలు విషయం కాదని.. ప్రపంచంలో ఏ దర్శకుడు కూడా మొహం చూపించకుండా భయపెట్టలేదని అప్పట్లో విమర్శకులు సైతం ప్రశంసించారు.

రామ్ గోపాల్ వర్మ శిష్యుడు కావడంతో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటానికి జేడీ చక్రవర్తి ఏమాత్రం మొహమాటపడడు. అలా కొన్నిసార్లు తన వివాదాస్పద వ్యాఖ్యలతో కాంట్రవర్సీలకు కూడా కారణమయ్యారు. కెరీర్ ప్రారంభం నుంచి పలువురు హీరోయిన్లతో జేడీ చక్రవర్తి ప్రేమాయణం నడిపించారని అంటూ ఉంటారు. అయితే తాను పెళ్లి, పిల్లలు అనే అంశాలకు దూరంగా ఉంటానని చాలా సార్లు చెప్పారు జేడీ చక్రవర్తి. అయితే తన 46వ ఏట బ్యాచిలర్ లైఫ్‌కు స్వస్తి పలికిన ఆయన సినీ నటి అనుకృతి శర్మను పెళ్లాడారు.

అయితే హీరోయిన్ రంభ విషయంలో మాత్రం జేడీ చక్రవర్తికి ఇంట్రెస్ట్ ఉందని అప్పట్లో ఫిలింనగర్‌లో టాక్. ఆమెతో ప్రేమలో పడ్డ ఆయన పెళ్లి వరకు వెళ్లారని అంటారు. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ.. రంభ అంటే మాత్రం జేడీకి పిచ్చి అని ఆయన మిత్రుడు, నటుడు ఉత్తేజ్ పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. ఇటీవల ఓ సినిమా కార్యక్రమంలో ఉత్తేజ్ మాట్లాడుతూ.. రంభ అన్నా, ఆమె తొడలన్నా జేడీ చక్రవర్తికి పిచ్చి అని చెప్పారు.

అప్పట్లో పంజాగుట్ట ఏరియాలో రంభ భారీ కటౌట్ ఉండేదని, అర్ధరాత్రి పూట నన్ను తీసుకుని ఆ కటౌట్ దగ్గరికి వెళ్లి రంభ తొడలు చూసి రూమ్‌కి వచ్చే వాళ్లమని ఉత్తేజ్ తెలిపారు. రంభ కటౌట్ చూడటానికి వెళ్లినవాడు.. రంభతోనే కలిసి నటించే స్థాయికి ఎదిగాడని తన ఫ్రెండ్ గురించి చెప్పుకొచ్చాడు ఉత్తేజ్. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: jd chakravarthy rambha uttej
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X