హీరో రాజశేఖర్ ఫ్యామిలీ ప్యాక్ మూవీ.. భార్య, ఇద్దరు కూతుళ్లతో..
గరుడ వేగ, కల్కి సినిమాల తర్వాత యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ మంచి జోష్ మీద ఉన్నట్టు కనిపిస్తున్నారు. కల్కి రిలీజ్ తర్వాత కాస్త రిలాక్సైన ఆయన తన తదుపరి సినిమాలపై దృష్టిపెడుతున్నాడు. కల్కి సినిమా రిలీజ్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. సినిమా కోసం పడిన కష్టాన్ని వెల్లడించారు. తన సినిమా రిలీజ్ విషయంలో శివాత్మిక, శివానీ తనకు ఎనలేని సపోర్ట్ ఇచ్చారు. సినిమా పట్ల ఆ ఇద్దరి తపన చూసిన తర్వాత కుమారుడు లేని బాధ తీరిపోయిందన్నారు. తన కూతురితో నటించే అవకాశం వస్తే తప్పుకుండా చేస్తానన్నారు.
త్వరలోనే తన కూతుళ్లు రాసిన కథను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాం. వారిద్దరు మంచి కథ చెప్పారు. నాకు నచ్చడంతో నిర్మాత సీ కల్యాణ్‌కు చెప్పమంటే వెళ్లి చెప్పి వచ్చారు. కథ విన్న తర్వాత కల్యాణ్ గారు థ్రిల్ అయ్యారు. వెంటనే సినిమాను తానే నిర్మిస్తానని చెప్పాడు. అయితే ఆ సినిమాలో నేను, జీవిత, శివాత్మిక, శివానీ అందరం కలిసి నటిస్తాం.

కానీ శివాత్మిక, శివానీలు తమ సినిమాల ద్వారా ప్రేక్షకులకు, టాలీవుడ్‌కు పరిచయమయ్యాక.. ఆ సినిమాను పట్టాలెక్కిస్తాం. మేమందరం కలిసి నటించే సినిమా ఓ ఫ్యామిలీ ప్యాక్‌లో ఉంటుంది అని అన్నారు. ఇక గరుడ వేగ 2 కూడా త్వరలో మొదలవుతుంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు కథపై పనిచేస్తున్నారు. ఆయన చెప్పిన లైన్.. గరుడ వేగ కంటే మరోస్థాయి ఎక్కువగానే ఉంది. త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కుతుంది అని రాజశేఖర్ అన్నారు.
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కల్కి'. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక, 'వైట్ లాంబ్ పిక్చర్స్' వినోద్ కుమార్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 28న శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై నిర్మాత కె.కె. రాధామోహన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సినిమాకు మంచి రెస్సాన్స్ కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











