వాళ్లే ఫుడ్ పెట్టారు.. డోంట్ కేర్.. అది లేకుంటే కష్టం : విజయ్ దేవరకొండ

Recommended Video

Vijay Deverakonda Interesting Comments About His Personal Life || Filmibeat Telugu

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస విజయాలు, అవకాశాలతో దూసుకెళుతున్నారు. కేవలం సినిమాలే కాదు.. సక్సెస్ రేసులో ఉన్న ఈ హీరోతో వ్యాపార ప్రకటనలు చేయించడానికి కార్పొరేట్ సంస్థలు పోటీ పడుతున్నాయి. మరోపైపు ప్రముఖ మేగజైన్స్ సైతం విజయ్ ఫోటోను తమ కవర్ పేజీపై వేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి.

'రౌడీ' పేరుతో కొంతకాలం క్రితమే తన సొంత ఫ్యాషన్ బ్రాండ్ లాంచ్ చేసిన విజయ్.. తొలిసారిగా రౌడీ వేర్ ధరించి 'జెఎఫ్‌డబ్ల్యు' మేగజైన్ ఫోటో షూట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ 'అర్జున్ రెడ్డి' స్టార్ తన ఇష్టాలతో పాటు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

అది లేకుండా ఉండటం కష్టం

అది లేకుండా ఉండటం కష్టం

నాతో ఎప్పుడూ ఉండే వస్తువుల్లో ఫోన్ ముఖ్యమైనది... ప్రస్తుతం ఉన్న రోజుల్లో మన జేబులో డబ్బు లేకుండా సర్వైవ్ అవ్వొచ్చు కానీ ఫోన్ లేకుండా కష్టం. ఇపుడు ప్రతీదీ ఫోన్‌తో ముడి పడి ఉంది. అందుకే బయటకు అడుగు పెట్టేపుడు ఫోన్ ఉందా? లేదా? అనేది తప్పకుండా చెక్ చేసుకుంటాను, అది లేకుండా ఉండం చాలా చాలా కష్టమని విజయ్ దేవరకొండ తెలిపారు.

వాళ్లే ఫుడ్ పెట్టారు

వాళ్లే ఫుడ్ పెట్టారు

విమానాల్లో ప్రయాణం చేసేపుడు చాలా సార్లు నా వద్ద డబ్బులు లేక పోయినా... లవ్లీ పాసింజర్స్ నా కోసం ఫుడ్ ఆర్డర్ చేశారు. ఎక్కడకు వెళ్లినా హ్యూమానిటీ, లవ్ అనేది దొరుకుతుంది, అభిమానించే వారు చాలా మంది ఉన్నారు, నన్ను ఇష్టపడే వారు ఇంత మంది ఎక్కడికి వెళ్లినా నా చుట్టూ ఉండటం సంతోషంగా ఉందని విజయ్ చెప్పుకొచ్చారు.

నిక్ నేమ్

నిక్ నేమ్

నిక్ నేమ్ డివిఎస్... అంటే దేవరకొండ విజయ్ సాయి. చాలా మంది నా స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పటికీ డీవీఎస్ అని పిలుస్తారు. నన్ను ఎవరైనా డివిఎస్ అని పిలిచారంటే... వెనక్కి తిరిగి చూడకుండానే నా ఫ్రెండ్ అని అర్థమైపోతుందన్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ స్నేహితులతో కలుస్తాను, వారి కోసం కొంత సమయం కేటాయిస్తాను అని విజయ్ వెల్లడించారు.

ప్రశాంత్ అంటే ఇష్టం, ఇష్టమైన డైలాగ్ డోంట్ కేర్

ప్రశాంత్ అంటే ఇష్టం, ఇష్టమైన డైలాగ్ డోంట్ కేర్

ఇప్పటి వరకు చేసిన ఆన్ స్క్రీన్ ఫేవరెట్ క్యారెక్టర్లో... అర్జున్ రెడ్డి, వరుణ్, విజయ్ కంటే... ‘పెళ్లి చూపులు' మూవీలో చేసిన ప్రశాంత్ పాత్ర అంటే ఇష్టం. ‘నోటా'లో వరుణ్ చీఫ్ మినిస్టర్ సన్, నాకు ఆ పాత్ర అస్సలు నచ్చదని దేవరకొండ తెలిపారు. నా సినిమాల్లో నా ఫేవరెట్ డైలాగ్... డోంట్ కేర్. నా జీవితంలో కూడా చాలా సార్లు అలాగే ఉంటాను. క్లీన్ షేవా? బీయర్డ్... ఈ రెండింటిలో గడ్డంతో ఉండటమే ఇష్టమని తెలిపారు.

ఆదివారం ఏం చేస్తానంటే..

ఆదివారం ఏం చేస్తానంటే..

ఆదివారం ఎక్కువగా పడుకోవడానికే టైమ్ కేటాయిస్తాను. ఫేవరెట్ ఫుడ్ అంటే ప్రస్తుతం లెబనీస్ ఫుడ్ అంటే ఇష్టం. వంట చేయడం రాదు. ఎగ్స్ బాయిల్డ్ చేయడం వచ్చు... అని మరో ప్రశ్నకు విజయ్ సమాధానం ఇచ్చారు. ‘బీర్ అండ్ ఫిపా విత్ బాయ్... వైన్ డేట్ విత్ గర్ల్' ఈ రెండింటిలో ఏది ఇష్టం అంటే బీర్ అంటే ఇస్టమన్నారు. వైన్ డేట్ విత్ గర్ల్ ఎప్పుడూ ఎక్స్‌పీరియన్స్ కాలేదని తెలిపారు.

టైటానిక్, పోకిరి చాలా సార్లు చూశా

టైటానిక్, పోకిరి చాలా సార్లు చూశా

చాలా సార్లు చూసిన సినిమాలు... టైటానిక్, పోకిరి. పోరికి మూవీలో ఫేవరెట్ డైలాగ్... ‘ఎవడు కొడితే దిమ్మ దిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు' అనేది చాలా ఇష్టమని తెలిపారు. విజయ్ సినిమాల విషయానికిస్తే ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X