NTR 30: కొరటాల శివ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ మరో కీలక నిర్ణయం.. స్టన్ అవ్వాల్సిందే
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం స్టార్ హీరోలందరూ కూడా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేసేందుకు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో వారు తీసుకునే జాగ్రత్తలు కూడా చాలా హై రేంజ్ లో ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను సంతృప్తి పరచాలి అంటే అంత సాధారణమైన విషయం కాదు.. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు అనే విషయం ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. అందుకే స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాల కోసం ఏం చేయడానికైనా సరే కష్టపడుతున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత తన 30వ సినిమాను మొదలుపెట్టబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఎందుకంటే ఇది వరకే వీరి కలయికలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు అంతకు మించి అనేలా ఒక సినిమా చేయాలని అనుకుంటున్నారు. అంతేకాకుండా దర్శకుడు కొరటాల శివకు కూడా ఇది మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో ఆయన కూడా చాలా జాగ్రత్తగా ప్రాజెక్టును సెట్ చేస్తున్నాడు. అసలు విషయంలోకి వెళితే ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందట. ముఖ్యంగా ఫిట్నెస్ విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొరటాల శివ సినిమాలో సరి కొత్త బాడీ లాంగ్వేజ్తో కనిపిస్తాడట. అంతేకాకుండా వర్కౌట్స్ కూడా చేస్తున్నట్లు సమాచారం. RRR లో మాదిరిగా కాకుండా కాస్త తక్కువగానే బాడీని ప్రెసిడెంట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఒకవైపు సాధారణ వ్యక్తిలా కనిపిస్తూనే పవర్ ఫుల్ గా ఉండాలి అని దర్శకుడు కొరటాల శివ సూచించాడట. ఒక సామాన్యుడు పవర్ఫుల్ సిస్టన్ ఎదురిస్తే ఎలా ఉంటుందో సినిమాలో హైలెట్ అయ్యే విధంగా ఉండాలి అని స్క్రిప్టు రెడీ చేసుకున్నట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ ఆ ప్రాజెక్టు పై చాలా నమ్మకంతో ఉన్నాడు. అసలైతే మొదట కొరటాల శివ ఈ సినిమాను కేవలం తెలుగులోనే తెరపైకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ తో చర్చలు జరిపిన అనంతరం కథ అన్ని భాషల వారికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి పాన్ ఇండియా రేంజ్ లో చేయాలి అని చెప్పాడు. దీంతో కొరటాల శివ స్క్రిప్టును పై కూర్చుని మరింత పవర్ఫుల్ గా మార్చాడు. త్వరలోనే ఎన్టీఆర్ 30వ సినిమా లాంచ్ చేయాలని కొరటాల శివ ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ తో పాటు కళ్యాణ్ రామ్ ఆర్ట్స్ కూడా సంయుక్తంగా నిర్మిస్తుంది. ఇక ఎన్టీఆర్ ఈ సినిమా అనంతరం ప్రశాంత్ నీల్ తో కూడా మరో సినిమా చేయబోతున్నాడు అంతేకాకుండా బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











