NTR 30: ఫైనల్ గా హీరోయిన్ సెట్ అయినట్లే.. త్వరలోనే మరో అఫీషియల్ అప్డేట్!
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఇక మొత్తానికి ఇటీవల సినిమాకు సంబంధించిన మరో అధికారిక ప్రకటన విడుదలైంది. రెగ్యులర్ షూటింగ్ వీలైనంత త్వరగా మొదలుపెట్టాలి అని కొరటాల టీమ్ సిద్ధమయ్యింది. దాదాపు ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ కూడా ఫినిష్ అయ్యాయి. ఇక ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయడానికి ఒక టార్గెట్ అయితే సెట్ చేసుకున్నారు.
ఇక దర్శకుడు శివ ఈ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకొని మళ్ళీ ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా, కొరటాల శివ పూర్తిస్థాయిలో పవర్ ఫుల్ స్క్రిప్టు సిద్ధం చేసే వరకు కూడా షూటింగ్ మొదలు పెట్టకూడదు అని అనుకున్నాడు. ఇక మొత్తానికి అనుకున్నట్లుగా స్క్రిప్టు రెడీ కావడంతో షూటింగ్ స్టార్ట్ చేయడానికి అందరూ సిద్ధమయ్యారు. అయితే హీరోయిన్ విషయంలో మాత్రం కొంత సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మొదట ఆలియా భట్ ను అనుకుని ఆ తర్వాత కీయరా అద్వానీ పేరును కూడా అనుకున్నట్లు రకరకాల వార్తలు వచ్చాయి.

ఇక మొత్తానికి జాన్వీ కపూర్ అయితే ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. ఆమె ఎన్టీఆర్ తో సినిమా చేస్తే తప్పకుండా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ వస్తుంది అని ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ 30వ సినిమాలో ఒక మంచి సోషల్ పాయింట్ తో పాటు హై లెవెల్ యాక్షన్ డోస్ కూడా ఉంటుందట.

గతంలో ఎప్పుడు లేనివిధంగా ఎన్టీఆర్ ఒక డిఫరెంట్ యాక్షన్ పాత్రలో కనిపించబోతునట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. దర్శకుడు కొరటాల శివ ఇది మొదటి పాన్ ఇండియా సినిమా కాబట్టి అన్ని విషయాల్లో కూడా ఆలోచించి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా నటీనటులను కూడా వివిధ భాషల నుంచి తీసుకువస్తున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ కు ఏ స్థాయిలో సక్సెస్ అందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











