20 ఏళ్ల క్రితమే సీఎం కుర్చీపై కన్నేసిన యంగ్ టైగర్.. సినిమా ఇండస్ట్రీలో ఉండనంటూ ఎన్టీఆర్ క్లారిటీ

జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఎంతగానో శ్రమించాడు. నందమూరి బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ సొంత టాలెంట్ తోనే ఛాన్సులు అందుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు. అయితే స్టార్ డమ్ ఎంత పెరిగినా కూడా తారక్ ఎవరితో అయినా సరే నచ్చితే స్నేహంగా ఉండేవాడు అంటూ ఇటీవల ఒక కో డైరెక్టర్ వివరణ ఇచ్చాడు. ఒక సినిమా షూటింగ్ సమయంలో తారక్ చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేశాడు.

అసిస్టెంట్ దర్శకులతో..

అసిస్టెంట్ దర్శకులతో..

జూనియర్ ఎన్టీఆర్ వీలైనంత వరకు స్టార్ హోదాతో సంబందం లేకుండా స్నేహం చేస్తుంటాడని ఆయనతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు చెబుతుంటారు. ముఖ్యంగా అసిస్టెంట్ డైరెక్టర్స్ కో డైరెక్టర్స్ తో చాలా స్నేహంగా ఉంటారని అందరికి తెలిసిన విషయమే. అప్పట్లో నాన్నకు ప్రేమతో షూటింగ్ లో బుచ్చిబాబును స్విమ్మింగ్ ఫుల్ ఎత్తేసిన వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

అతనే బెస్ట్ ఫ్రెండ్

అతనే బెస్ట్ ఫ్రెండ్

జూనియర్ ఎన్టీఆర్ కు నచ్చితే గనక వారిని అంత ఈజీగా వదిలేయడని అంటుంటారు. ఇక ఒక్కసారి స్నేహం చేస్తే వారిని నవ్వించడమే కాకుండా సరదాగా ఆట పట్టిస్తుంటాడు కూడా. జూనియర్ ఎన్టీఆర్ కొంతమంది స్టార్ హీరోలతో కూడా అంతే సరదాగా ఉంటాడు. రామ్ చరణ్ ఇప్పుడు అతని బెస్ట్ ఫ్రెండ్.

సుబ్బు కో డైరెక్టర్..

సుబ్బు కో డైరెక్టర్..

ఇక ఇటీవల సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్ అయినటువంటి GK చౌదరి కూడా ఎన్టీఆర్ తో ఉన్న అనుభవం గురించి చెప్పాడు. 2001లో సుబ్బు సినిమాకు తాను కో డైరెక్టర్ గా వర్క్ చేశానని అయితే ఆ సమయంలో తారక్ కు సరైన స్టార్ డమ్ రాకపోయినప్పటికి ఎంతో కాన్ఫిడెంట్ ఉండేవాడు అని వివరించారు.

ఇద్దరం కలిసి దమ్ము కొట్టేవాళ్ళం

ఇద్దరం కలిసి దమ్ము కొట్టేవాళ్ళం

GK చౌదరి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కు సుబ్బు మూడవ సినిమా. ఇప్పుడున్నంత క్రేజ్ అప్పుడు లేదు. అప్పుడు తారక్ నాతో చాలా క్లోజ్ గా ఉండేవాడు. ఆ షూటింగ్ సమయంలో ఇద్దరం కలిసి దమ్ము కొట్టేవాళ్ళం. దర్శకుడు సురేష్ వర్మ షార్ట్ రెడీ అన్నప్పుడు మేము ఇద్దరం కలిసి సిగరెట్ తాగడానికి వెళ్లి మాట్లాడుకునే వాళ్ళం. సీన్ గురించి చర్చిస్తున్నాం అని దర్శకుడితో చెప్పవాడు.

Jr ఎన్టీఆర్ స్నేహం వల్ల రెంటు పెరిగింది

Jr ఎన్టీఆర్ స్నేహం వల్ల రెంటు పెరిగింది

జూనియర్ ఎన్టీఆర్ నాతో ఎంత క్లోజ్ గా ఉండేవారు అంటే.. మా ఇంటి ఓనర్ షూటింగ్ సమయంలో స్పాట్ కు వచ్చినప్పుడు తారక్ నా భుజాలపై చేతులు వేశాడు. అప్పుడు మా ఇంటి ఓనర్ వెంటనే అద్దె పెంచేశారు. ఎందుకని ఆడిగితే.. జూనియర్ ఎన్టీఆర్ నీకు అంత క్లోజ్ కదా అంటూ మాట్లాడేవారని అన్నాడు.

Recommended Video

Pushpa అంత పెద్ద రిస్క్ చేస్తుందా ? | Allu Arjun | Pushpa Raj || Filmibeat Telugu
 నెక్స్ట్ సీఎం నేనే అన్నాడు..

నెక్స్ట్ సీఎం నేనే అన్నాడు..

ఇక ఒకనొక సమయంలో ఎన్టీఆర్ పదేళ్ల తరువాత సినిమాలు చేయకూడదనే ఆలోచనలో ఉన్నట్లు తనతో చెప్పినట్లు GK చౌదరి వివరణ ఇచ్చారు. నేనేమిటో నాకు తెలుసు. నేను పదేళ్లు మాత్రమే ఇండస్ట్రీలో ఉంటాను. ఆ తరువాత డైరెక్ట్ గా సీఎం అవ్వడమే అని.. జూనియర్ ఎన్టీఆర్ 15 ఏళ్ళ క్రితమే తనతో క్లారిటీగా చెప్పినట్లు వివరణ ఇచ్చాడు. తప్పకుండా అతను ఆంద్రప్రదేశ్ సీఎం అవుతాడని కూడా చౌదరి తెలియజేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X