రాజమౌళికి తెలిస్తే గొడ్డలితో నా వెనకే వస్తాడు..RRR తరువాత ఆ దర్శకులతోనే: క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్

ఇండియన్ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటైన RRR కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆ పాన్ ఇండియా సినిమాపై చాలా కాలం తరువాత జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు. సినిమా విశేషాలతో పాటు తన పర్సనల్ లైఫ్ గురించి అలాగే ఫ్యూచర్ సినిమాలపై కూడా ఒక క్లారిటీ ఇచ్చేశాడు.

అంచనాలకు తగ్గట్లుగానే..

అంచనాలకు తగ్గట్లుగానే..

RRR సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. మొదటిసారి ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో కూడా అంచనాల డోస్ పెరుగుతున్నాయి. సినిమా తప్పకుండా అంచనాలను అందుకుంటుందని తారక్ కూడా చెబుతున్నాడు.

ఆ ఛాన్స్ దొరికింది..

ఆ ఛాన్స్ దొరికింది..

కోవిడ్ కారణంగా నా కెరీర్ లో మొదటిసారి షూటింగ్ లేకుండా ఎక్కువరోజులు ఖాళీగా ఉన్నాను. సినిమా ఇండస్ట్రీకి ఇది చాలా పెద్ద దెబ్బ. అయితే ఒక విధంగా నా కుటుంబ సభ్యులతో పిల్లలతో ఎక్కువ సమయం గడిపే ఛాన్స్ దొరికింది. వారితో ఉంటే టైమ్ అస్సలు తెలియదు. అందువల్ల నేను ఎంతో సంతోషంగా ఉంటున్నాను.. అని ఎన్టీఆర్ చెప్పాడు.

బడ్జెట్ విషయంలో..

బడ్జెట్ విషయంలో..

సినిమా గురించి మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్.. కోవిడ్ వలన ఈ సినిమా బడ్జెట్ విషయంలో పెద్దగా మార్పులు ఏమి జరగలేదు. అంతకుముందు కాస్త నెమ్మదిగా జరిగిన వర్క్ ఈ మధ్య కాలంలో ఇంకాస్త వేగంగా జరుగుతుందని అన్నాడు. కరోనా పరిస్థితుల కారణంగా మళ్ళీ సినిమా షూటింగ్ నిలిపివేసినట్లు తారక్ వివరణ ఇచ్చారు.

రాజమౌళి గొడ్డలితో వచ్చేస్తాడు

రాజమౌళి గొడ్డలితో వచ్చేస్తాడు

ఈ సినిమా తప్పకుండా నెవర్ బిఫోర్ అనేలా ఉంటుంది. బాహుబలి తరువాత ఇండియన్ సినిమా మార్కెట్ లో ఎన్నో మార్పులు వచ్చాయి. భాషతో సంబంధం లేకుండా సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. ఇక RRRలో ప్రతి ఒక్క సీన్ కూడా అన్ని భాషల వారిని ఆకట్టుకుంటుంది. ఇంతకంటే నేను సినిమా గురించి ఎక్కువగా మాట్లాడలేను. అలా చేస్తే రాజమౌళి నా వెనక గొడ్డలి పట్టుకొని వచ్చేస్తాడు.. అంటూ తారక్ సరదాగా తెలిపాడు.

Recommended Video

Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
RRR తరువాత చేయబోయే సినిమాలు..

RRR తరువాత చేయబోయే సినిమాలు..

ఇక RRR తరువాత చేయబోయే సినిమాలపై కూడా జూనియర్ ఎన్టీఆర్ చాలా క్లారిటీగా వివరణ ఇచ్చేశాడు. RRR అయిపోయిన తరువాతే కొరటాల శివ సినిమాను స్టార్ట్ చేయబోతున్నట్లు చెబుతూ.. ఆ తరువాత KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరొక సినిమా ఉంటుందని తారక్ వివరణ ఇచ్చారు.

ఇక కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో కూడా చేయవచ్చనే టాక్ బాగానే వచ్చింది. ఆ రూమర్స్ పై తారక్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ధీంతో జూనియర్ ఎన్టీఆర్ తదుపరి సినిమాలు మూడు మాత్రమే ఫిక్స్ అని ఒక క్లారిటీ వచ్చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X