For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTR New Look: ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న ఎన్టీఆర్ లుక్.. దీని వెనుక 10 కోట్లు సీక్రెట్ తెలిస్తే!

  |

  టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే సినిమాల్లోకి వచ్చినా.. తనదైన శైలి యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, పాటలు ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. దీంతో అతడి క్రేజ్ ఖండంతరాలు దాటింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ కొత్త లుక్‌తో కనిపించాడు. మరి దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ తెలుసుకుందామా!

  వరుస హిట్లు.. పాన్ ఇండియా

  వరుస హిట్లు.. పాన్ ఇండియా

  ఎన్టీఆర్.. 'టెంపర్' నుంచి వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా భారీ హిట్ అయింది. దీంతో అతడి రేంజ్ భారీగా పెరిగింది.

  అషు రెడ్డి 'కామం' వీడియో వైరల్: వాళ్లకు మాత్రమేనట.. కింద కామెంట్స్ చూశారంటే!

  కొరటాలతో సినిమా.. రెడీగానే

  కొరటాలతో సినిమా.. రెడీగానే

  RRR పట్టాలపై ఉన్నప్పుడే ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తున్నట్లు వెల్లడించాడు. దీనిని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. దీనికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక, ఈ చిత్రం ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఇది మొదలవుతున్నట్లు యూనిట్ అధికారికంగా చెప్పింది.

  కేజీఎఫ్ డైరెక్టర్‌తో నెక్ట్ ఇయర్

  కేజీఎఫ్ డైరెక్టర్‌తో నెక్ట్ ఇయర్

  ఫ్యూచర్ ప్రాజెక్టులను జూనియర్ ఎన్టీఆర్ వరుసగా లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే అతడు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని గత ఏడాదే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఇక, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో కానీ, మేలో కానీ స్టార్ట్ చేస్తామని ప్రశాంత్ చెప్పుకొచ్చాడు.

  డోసు పెంచేసిన జబర్దస్త్ వర్ష: ముందూ వెనుక ఏమీ లేకుండా హాట్ షో

  ఆ డైరెక్టర్లతో ప్రాజెక్టులకు రెడీ

  ఆ డైరెక్టర్లతో ప్రాజెక్టులకు రెడీ

  ఇప్పటికే రెండు సినిమాలను అధికారికంగా ప్రకటించిన జూనియర్ ఎన్టీఆర్.. మరికొందరు దర్శకులతోనూ కథా పరమైన చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇలా ఇప్పటికే ఈ స్టార్ హీరో ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు సన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. అలాగే, వెట్రిమారన్, అట్లీ, త్రివిక్రమ్‌, హను రాఘవపూడిలతోనూ సినిమాలు చేయబోతున్నాడట.

  కొత్త లుక్ రివీల్ చేసిన స్టైలిస్ట్

  కొత్త లుక్ రివీల్ చేసిన స్టైలిస్ట్

  టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే కొరటాల శివతో సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ స్టైలిష్ గెటప్‌తో కనిపించాడు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ ఎన్టీఆర్ కొత్త లుక్ ఫొటోను సోషల్ మీడియాలో వదిలాడు. ఇందులో ఈ స్టార్ హీరో బాద్‌షా గెటప్‌ను గుర్తు చేసేలా ఉన్నాడు.

  పెళ్లైన కొత్తలోనే హీరోయిన్ పూర్ణకు షాక్: బయటపడిన భారీ మోసం.. తన భర్త ఎలాంటి వాడో చెబుతూ పోస్ట్

  ఆ యాడ్ కోసమే ఎన్టీఆర్ లుక్

  ఆ యాడ్ కోసమే ఎన్టీఆర్ లుక్

  జూనియర్ ఎన్టీఆర్ స్టైలిస్ మేకోవర్ బయటకు రావడంతో ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదే సమయంలో దీనిపై ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. తారక్ ఇప్పుడు ఓ ప్రముఖ బ్రాండ్ కోసం కమర్షియల్ యాడ్ చేస్తున్నాడు. దీనికోసమే అతడు ఈ కొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ షూట్ ముగిసినట్లు సమాచారం.

  తారక్‌కు పది కోట్ల రూపాయలు

  తారక్‌కు పది కోట్ల రూపాయలు


  తాజాగా చేసిన కమర్షియల్ యాడ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు కూడా హాట్ టాపిక్ అవుతోన్నాయి. ఈ నేపథ్యంలో ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. ఇందులో నటించడం కోసం తారక్ ఏకంగా పది కోట్ల రూపాయలు చార్జ్ చేశాడట. అంతేకాదు, ఈ యాడ్ చేయడం కోసం సదరు సంస్థ భారీగానే ఖర్చు చేసిందని టాక్.

  English summary
  Tollywood Star Hero Jr NTR Now Doing Commercial Advertisement. Now His New Look Photo Gone Viral in Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X