బావా అంటూ బన్నీతో ఎన్టీఆర్ ఆప్యాయత..వస్తున్నా అంటూ ట్విస్ట్ ఇచ్చిన పుష్ప రాజ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీ ప్రముఖులు అందరూ కూడా విషెస్ చేశారు. రామ్ చరణ్ కూడా బన్నీకి ట్విట్టర్ ద్వారా విశేష్ చెప్పారు. ఇక సెలబ్రిటీల అందరి నుంచి విశేష్ వచ్చిన అందులో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పెట్టిన పోస్టు మాత్రం వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
బెస్ట్ డ్యాన్సర్స్: టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియా మొత్తంలో కూడా హీరోలలో బెస్ట్ డ్యాన్సర్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ టాప్ లో ఉంటారు అని చెప్పవచ్చు. ఒక విధంగా తారక్, అల్లు అర్జున్ మధ్య మంచి బాండింగ్ ఉంది. నందమూరి అభిమానులు, మెగా అభిమానులు ఎంతగా సోషల్ మీడియాలో విమర్శలు చేసుకున్న వారి మధ్య మంచి క్లోజ్ బాండింగ్ ఉందనే విషయాన్ని ఇప్పటికే రామ్ చరణ్ పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు.

పుట్టినరోజు సందర్భంగా: ఇప్పుడు బన్నీ బర్త్ డే సందర్భంగా తారక్ చేసిన ట్వీట్ కారణంగా అతనితో కూడా మంచి స్నేహబంధం ఉందనే విషయం స్పష్టం అయ్యింది. హీరోలు కలిసి ఉంటే ఫ్యాన్స్ కు ఎంత హ్యాపీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన వారం లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య దారుణంగా ట్వీట్స్ వార్ సాగుతోంది. ఇక అలాంటి వాతావరణంలో స్టార్స్ మంచి బాండింగ్ ను హైలెట్ చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది.
హ్యాపీ బర్త్ డే బావా: ఇక సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్.. హ్యాపీ బర్త్ డే బావా... నువ్వు చాలా గొప్ప వ్యక్తివి అంటూ అల్లు అర్జున్ కి ట్యాగ్ చేసి జూనియర్ ఎన్టీఆర్ విశేష్ చేశారు. దీనికి అల్లు అర్జున్ కూడా రెప్లై ఇచ్చాడు. నీ ప్రేమ పూర్వక అభినందనలకి కృతజ్ఞతలు భావా.. బిగ్ హగ్స్ అంటూ కామెంట్ చేశారు.

పార్టీ లేదా పుష్ప: దీనిపై మరల తారక్ స్పందిస్తూ హగ్స్ మాత్రమేనా.. పార్టీ లేదా పుష్ప అని కామెంట్స్ చేయడం జరిగింది. ఇక ఆ కామెంట్ కి కూడా అల్లు అర్జున్ బదులిచ్చాడు. వస్తున్నా.. అని NTR30 స్టైల్ లో పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు వీరి మధ్య జరిగిన ట్విట్టర్ టాకింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్టులపై ఫ్యాన్స్ కుడా అదే రీతిలో చూసి కామెంట్స్ చేయడం విశేషం.

ట్వీట్స్ వైరల్: తారక్ పెట్టిన పోస్టులని అయితే ఏకంగా 4 మిలియన్స్ ఫాలోవర్స్ చూడటం విశేషం. మరి వీరిద్దరూ కలిసి పార్టీ చేసుకున్నారా లేదా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫ్యాన్స్ కోసం వీరి పార్టీకి సంబందించిన ఫోటోలని చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు.
బన్నీకి సెలబ్రిటీలు అందరూ చెప్పిన విషెస్ ఒక ఎత్తయితే ఇప్పుడు తారక్ చేసిన విషెస్ మాత్రం ట్రెండ్ లోకి వచ్చి వైరల్ గా మారడం విశేషం. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30వ సినిమాతో బిజీగా ఉండగా అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో ఉన్నాడు. ఇక ముందుగా ఈ ఏడాది లేదా 2024 మొదట్లో పుష్ప 2 ప్రేక్షకులకు ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











