ఎన్టీఆర్ ఇంటికి భార్యతో కలిసి వెళ్లిన అగ్ర దర్శకుడు.. ఓకే రోజు రెండు వేడుకలు.. ఫొటోస్ వైరల్!

RRR సినిమా మొత్తానికి బాక్సాఫీస్ వద్ద సరికొత్త విజయాన్ని సొంతం చేసుకోవడంతో జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత సినిమాల్లో కూడా అదే తరహాలో సక్సెస్ అందుకోవాలి అని చూస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 35వ సినిమా స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి ఎన్టీఆర్ తన ఫ్యామిలీ లైఫ్ తో చాలా సంతోషంగా గడుపుతున్నాడు. ఇక రీసెంట్ గా ఒక అగ్ర దర్శకుడు అలాగే అతని భార్య ఇద్దరు కూడా ఎన్టీఆర్ తో కలిసి ఒకేసారి వెడ్డింగ్ యానివర్సరీ వేడుకలు జరుపుకోవడం విశేషం. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి ఆ వివరాల్లోకి వెళితే..

ఆ సినిమా తో వచ్చిన క్రేజ్ తో..

ఆ సినిమా తో వచ్చిన క్రేజ్ తో..

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఆ సినిమా తో వచ్చిన క్రేజ్ తో అదే తరహాలో పాన్ ఇండియా ప్రపంచంలో వారి మార్కెట్ను మరింత పెంచుకోవాలని ఎన్టీఆర్ రామ్ చరణ్ కష్టపడుతున్నారు.

చాలా పెద్ద కాన్వాస్ ఉన్న కథ

చాలా పెద్ద కాన్వాస్ ఉన్న కథ

ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ లైనప్ పై ప్రస్తుతం అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ముందుగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాను మొదలు పెట్టబోతున్న విషయం తెలిసిందే ఆ సినిమా జనతా గ్యారేజ్ కంటే హై లెవెల్ లో చాలా పెద్ద కాన్వాస్ ఉన్న కథ అని దర్శకుడు ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్ కూడా ఆ సినిమాలో రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

దీక్ష ముగించుకున్న ఎన్టీఆర్

దీక్ష ముగించుకున్న ఎన్టీఆర్

ఇక RRR కోసం దాదాపు రెండేళ్లపాటు నిర్విరామంగా కష్టపడిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడిప్పుడే కాస్త ఫ్యామిలీ లైఫ్ తో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల ఎన్టీఆర్ శివ దీక్షలో కనిపించిన విషయం తెలిసిందే. కొన్ని రోజులు దైవభక్తి లో ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు తదుపరి సినిమా కోసం మళ్ళీ కొత్తగా రెడీ అవుతున్నాడు.

 KGF దర్శకుడితో..

KGF దర్శకుడితో..

అయితే ఈ తరుణంలో ఎన్టీఆర్ ఒక అగ్ర దర్శకుడి తో కలిసి తన వెడ్డింగ్ యానివర్సరీ వేడుకలను జరుపుకోవడం విశేషం. ఆ దర్శకుడు మరెవరో కాదు కేజిఎఫ్ తో ప్రకంపనలు సృష్టించిన ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ అతని భార్య లిఖిత ఇద్దరూ కూడా గురువారం రోజు ఎన్టీఆర్ ఇంట్లోనే స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడం విశేషం.

ఒకేసారి యానివర్సరీ పార్టీ

ఒకేసారి యానివర్సరీ పార్టీ

మే 5వ తేదీన ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి వెడ్డింగ్ అనివర్సరీ అని అందరికీ తెలిసిన విషయమే. ఇక ప్రతి ఏడాది కూడా వీరు పెళ్లి రోజు వేడుకలను చాలా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఇదే రోజు ప్రశాంత్ నిల్ లిఖిత పెళ్లి రోజు కావడంతో ఎన్టీఆర్ పార్టీ కోసం కూడా ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించాడు ఇక ఈ నలుగురు కలిసి వారి పెళ్లి రోజు వేడుకలు ప్రత్యేకంగా కలిసి సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్

మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్

ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ సలార్ సినిమా తర్వాత తెరపైకి తీసుకు రాబోతున్నాడు. ఆ సినిమా కూడా హై వోల్టేజ్ యాక్షన్ ఫిలింగా తెరకెక్కుతుందట. ఇక దర్శకుడు ఇప్పటికే పూర్తి కథను సిద్ధం చేసుకున్నాడు ఇక వచ్చే ఏడాది ఆ ప్రాజెక్టును స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X