RRR హీరోల ప్రైవేట్ ఫొటోలు లీక్.. ఎన్టీఆర్ ఏంటి ఇలా అయిపోయాడు.. షాక్‌లో ఫ్యాన్స్.!
RRR.. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం. ఏడాది కాలంగా ఈ సినిమా గురించి వచ్చినన్ని వార్తలు మరే దానిపై వచ్చి ఉండవు. సోషల్ మీడియాలో కూడా ఇది ఎన్నో సార్లు ట్రెండ్ అయింది. అంతలా ఈ ప్రాజెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపుతోంది. బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్.. మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఇదే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయేలా చేస్తోంది. తాజాగా ఈ సినిమాలోని హీరోలకు సంబంధించిన ప్రైవేటు ఫొటోలు లీక్ అయ్యాయి. అసలు విషయానికి వస్తే...

రామ్ చరణ్ వస్తున్నాడు.. తారక్ మాత్రం
ఈ సినిమా ప్రారంభమైనప్పటి రామ్ చరణ్ ఎన్నో సార్లు కెమెరాల కంట పడ్డాడు. దీనికితోడు ‘సైరా: నరసింహారెడ్డి' ప్రమోషన్ టైమ్‌లోనూ మీడియా ముందుకు వచ్చాడు. అయితే, మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అస్సలు బయట కనిపించడం లేదు. అప్పుడప్పుడు ఆయన తప్పని పరిస్థితుల్లోనే దర్శనమిచ్చాడు. ఆ సమయంలో తారక్ లుక్ గురించి చర్చలు జరిగాయి.

ఆ ఫోటోలు మాత్రం వైరల్ అయిపోయాయి
జూనియర్ ఎన్టీఆర్ తన లుక్‌ను సీక్రెట్‌గా ఉంచాలనుకున్నాడో ఏమో గానీ చాలా రోజులుగా బయట జరిగే కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు. అయితే, ఆ మధ్య తారక్ తన భార్య, మరో మహిళతో కలిసి దిగిన ఫొటో వైరల్ అయింది. అలాగే, ఇటీవల వైజాగ్ ఎయిర్‌పోర్టులో అతడు కెమెరాల కంట పడ్డాడు. ఈ ఫొటోలు కూడా చక్కర్లు కొట్టాయి.
RRR హీరోల ప్రైవేట్ ఫొటోలు లీక్
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ విశాఖపట్నం జిల్లాలోని మన్యంలో జరుగుతోంది. ఇక్కడ కొన్ని పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఓ రిసార్టులో బస చేస్తున్నారు. అక్కడ వాళ్లు ఓ అభిమానితో ఫొటోలు దిగారు. ఇది బయటకు వచ్చింది. దానితో పాటు ప్రైవేటుగా ఉన్న ఫొటో కూడా లీక్ అయింది.

ఎన్టీఆర్ ఏంటి ఇలా అయిపోయాడు
ఈ ఫొటోలో జూనియర్ ఎన్టీఆర్‌ను చూసిన వారందరూ షాక్‌కు గురవుతున్నారు. దీనికి కారణం అతడు బాగా చిక్కిపోయినట్లు కనిపించడమే. ఉంగరాల జుట్టుతో ఉన్న తారక్.. ముఖం మాత్రం పీక్కుపోయినట్లు కనిపిస్తోంది. దీంతో ఫ్యాన్స్ అందరూ అందోళన చెందుతున్నారు. అదే సమయంలో రామ్ చరణ్ మాత్రం కోర మీసంతో కనిపిస్తున్నాడు.

అవన్నీ అక్కడే తీస్తున్నారా.?
ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై ఏడాది దాటిపోయింది. అయినప్పటికీ దీని షూటింగ్ మాత్రం డెబ్బై శాతం మాత్రమే జరిగింది. మిగిలిన భాగంలోనే తారక్, హీరోయిన్ మధ్య సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇప్పుడు విశాఖ మన్యంలో జరుగుతున్న షెడ్యూల్‌లోనే అవన్నీ పూర్తి చేస్తారా అన్నది చర్చనీయాంశం అవుతోంది.

న్యూ ఇయర్ గిఫ్ట్ ఉంటుందా.?
ఇక, ఈ సినిమాకు సంబంధించిన ఒక్క పోస్టర్ గానీ, పాట గానీ, టీజర్ గానీ ఏదీ ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఈ మధ్య ఎన్నో పండుగలు, ప్రత్యేకమైన రోజులు వచ్చినప్పటికీ యూనిట్ నుంచి ఒక్కటంటే ఒక్క అప్‌డేట్ కూడా రాలేదు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల్లో రాబోతున్న న్యూ ఇయర్ రోజున RRR నుంచి ఏదైనా సర్‌ప్రైజ్ వస్తుందా అన్న చర్చ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











