తమిళ్ హీరోతో ఎన్టీఆర్ మరో మల్టీస్టారర్.. వర్కౌట్ అయితే అభిమానులకు పండగే!
RRR సినిమా రిలీజ్ కాకముందే జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ అంచనాలను దాటిపోతోంది. రామ్ చరణ్ తో మొదటిసారి కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్న తారక్ అంతకంటే పెద్ద సినిమా మళ్ళీ ఎప్పుడు చేస్తాడో అనే ప్రశ్నలకు ముందుగానే సమాధానం దొరుకుతోంది. RRR పాన్ ఇండియా సినిమా కావడంతో వీలైనంత వరకు దేశవ్యాప్తంగా తారక్ తన మార్కెట్ పెంచుకునే విధంగా అయితే అడుగులు వేయకుండా ఉండలేడు.

అందరి దృష్టి వారిపైనే..
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమా తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా భారో స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ముఖ్యంగా బాలీవుడ్, కోలీవుడ్ లో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. బాహుబలి అనంతరం రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడం, అలాగే రామ్ చరణ్ ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తుండడంతో అందరి దృష్టి దీనిపైనే పడింది.

RRR తరువాత..
ఇకపోతే ఆ సినిమా తరువాత స్టార్స్ సెలెక్ట్ చేసుకునే సినిమాలు ఎలా ఉంటాయనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే తారక్ ఇప్పటికే ఒక ప్రాజెక్టును లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్టును లాక్ చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ RRR అయిపోగానే ఆయనతో సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.

కోలీవుడ్ స్టార్ హీరోతో..
ఇక తమిళ హీరోతో కూడా జూనియర్ ఎన్టీఆర్ మరో మల్టీస్టారర్ సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్. త్వరలో దర్శకుడు అట్లీ ఈ ఇద్దరి హీరోలను కలిపే ఛాన్స్ ఉన్నట్లు తమిళ్ మీడియాలో కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఈ కాంబినేషన్ వర్కౌట్ అయితే గనక అభిమానులకు పండగే అని చెప్పవచ్చు.
Recommended Video

ఆ దర్శకుడితోనే..
ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియదు గాని దర్శకుడు అట్లీ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తో ఎలాగైనా ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అయిపోయిన తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయనున్నాడు. ఆ తరువాత అట్లీతో వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల డైరెక్టర్ హీరోల మధ్య కథా చర్చలు కూడా విజయవంతం అయినట్లు సమాచారం. మరి ఆ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











