ఆ సినిమా విషయంలో కూడా క్లారిటీ ఇవ్వబోతున్న Jr ఎన్టీఆర్.. పుట్టినరోజు త్రిబుల్ ధమాకా?
జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ మొత్తానికి RRR సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నారు. ఇక ఆ తరువాత ఎలాగైనా మరో మంచి సినిమాతో సోలోగా సక్సెస్ కొట్టాలని ఈ ఇద్దరు హీరోలు తదుపరి సినిమాలపై చర్చలు కొనసాగిస్తున్నారు. ఇటీవల ఆచార్య సినిమాతో కొరటాల శివ డిజాస్టర్ అందుకోవడంతో ఎన్టీఆర్ కూడా కాస్త ఆలోచనలో పడ్డాడు. ఎన్టీఆర్ 30వ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్న విషయం తెలిసిందే. ఒక పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించే ముందు దర్శకుడు అలాంటి డిజాస్టర్ ఎదుర్కోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదని అందుకే కొరటాలతో చేయబోయే నెక్స్ట్ సినిమా విషయంలో మరింత సీరియస్ గా ఉండాలని డిసైడ్ అయ్యారట.
సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పై కూడా మరోసారి కొరటాల శివ వర్క్ చేయబోతున్నట్లు టాక్ కూడా వస్తోంది. కాన్ఫిడెంట్ గా అనిపించిన తరువాతనే సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టు ను ఇదివరకే అఫిషియల్గా అనౌన్స్ చేసిన కొరటాల శివ రెగ్యులర్ షూటింగ్ ను కూడా వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. అఫీషియల్గా సినిమా పూజా కార్యక్రమాలతో ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా లాంచ్ చేయాలని ఆలోచిస్తున్నారు. అయితే అదే రోజు మరొక రెండు సినిమాల విషయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో కూడా ఎన్టీఆర్ ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. సలార్ సినిమా తరువాత దర్శకుడు ప్రశాంత్ ఎన్టీఆర్ సినిమాను కూడా పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు. అయితే ఆ ప్రాజెక్టును ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా ఒక ముఖ్యమైన అప్ డేట్ తో క్లారిటీ ఇవ్వాలి అని ఇటీవల ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇక ఎన్టీఆర్ లిస్టులో 32వ సినిమాపై కూడా ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు గత కొంత కాలంగా అనేక రకాల కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు అయితే ఆ సినిమా తర్వాత మిగతా హీరోల నుంచి ఆఫర్లు వచ్చినప్పటికి కూడా అతను ఎన్టీఆర్ తో సినిమా చేయాలని కంకణం కట్టుకుని ఉన్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తోనే కథ చర్చల్లో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ మెప్పించే విధంగా చెప్పాలి అని చాలా నెలలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ ఇంకా ఎన్టీఆర్ నుంచి అయితే ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఈ ప్రాజెక్టును కూడా ఎన్టీఆర్ ఓకే చేసి తన పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్గా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే ఎన్టీఆర్ పుట్టినరోజు త్రిబుల్ ధమాకా ఉన్నట్లుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











