వ్యాపార రంగంలోకి దిగుతున్న ఎన్టీఆర్.. పొలిటికల్ లీడర్‌ను ఎదుర్కొనేందుకు ప్లాన్.!

By Manoj

'నిన్ను చూడాలని' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంటర్ అయ్యాడు నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా నిరాశనే మిగిల్చింది. అయితే, ఆ తర్వాత వచ్చిన 'స్టూడెంట్ నెం.1'తో అతడు మొదటి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత క్రమంగా సినిమాలు చేసిన తారక్.. కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరో అయిపోయాడు. ఇక, కొన్నేళ్లుగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యంగ్ టైగర్.. ఓ రాజకీయ నాయకుడిని ఎదుర్కొనేందుకు వ్యాపార రంగంలోకి అడుగు పెడుతున్నాడట. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

వరుస హిట్లతో హవా చూపిస్తున్న తారక్

వరుస హిట్లతో హవా చూపిస్తున్న తారక్

యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్, కామెడీకి తోడు సింగర్‌గానూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు తారక్. ఆ మధ్య పరజయాలతో సతమతం అయిన అతడు.. కొన్నేళ్లు వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే తన మార్కెట్‌ను గణనీయంగా పెంచుకున్నాడు. అలాగే, ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

భారీ మల్టీస్టారర్‌లో.. రియల్ హీరో పాత్రలో

భారీ మల్టీస్టారర్‌లో.. రియల్ హీరో పాత్రలో

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్... దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘RRR'లో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. టాలీవుడ్ హిస్టరీలోనే భారీ మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ సినిమాలో తారక్.. కొమరం భీంగా, చరణ్.. అల్లూరిగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో అన్ని పరిశ్రమలకు చెందిన నటులు కీలక పాత్రలు చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మరోసారి ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్

మరోసారి ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్

గతంలో తనకు ‘అరవింద సమేత.. వీరరాఘవ'తో భారీ విజయాన్ని అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్టీఆర్ మరోసారి కలిశాడు. RRR పూర్తయిన వెంటనే ప్రారంభమయ్యే ఈ సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కనున్న ఈ మూవీకి ‘అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ సిద్ధపడుతున్నాడా.?

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ సిద్ధపడుతున్నాడా.?

ఈ సినిమాకు ప్రచారంలో ఉన్న టైటిల్ ఆధారంగా ఎన్నో ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమా పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో తెరకెక్కబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో తారక్ రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడని అంటున్నారు. దీంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి క్రమక్రమంగా పెరిగిపోతోంది.

ఎన్టీఆర్.. త్రివిక్రమ్.. మధ్యలో మంత్రి గారు

ఎన్టీఆర్.. త్రివిక్రమ్.. మధ్యలో మంత్రి గారు

పాత సినిమాలను ఆధారంగా తీసుకుని త్రివిక్రమ్ తన సినిమాలు తెరకెక్కిస్తాడని ఓ టాక్ ఉంది. ఇప్పటికే చాలా సినిమాలకు కాపీ వాసనలు వచ్చాయి. ఇప్పుడు ఎన్టీఆర్‌తో చేసే మూవీ కూడా గతంలో చిరంజీవి నటించిన ‘మంత్రి గారి వియ్యంకుడు' ఆధారంగా తెరకెక్కబోతుందని అంటున్నారు. తన చెల్లి పెళ్లి కోసం మంత్రితో పోటీ పడే యువకుడిగా తారక్ కనిపిస్తాడనే టాక్ వినిపిస్తోంది.

వ్యాపార రంగంలోకి దిగుతున్న ఎన్టీఆర్

వ్యాపార రంగంలోకి దిగుతున్న ఎన్టీఆర్


తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దాని ప్రకారం... ఈ సినిమాలో తారక్.. యువ వ్యాపారవేత్తగా కనిపించబోతున్నాడట. చిన్న వయసులోనే ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆదర్శవంతమైన బిజినెస్‌మ్యాన్‌గా అతడిని చూపించబోతున్నాడట గురూజీ. గతంలో ‘నాన్నకు ప్రేమతో' మూవీలోనూ అదే టచ్ ఉన్న పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.

Recommended Video

#Betherealman: Why Mahesh Babu, Pawan Kalyan, Prabhas Are Not In Challenge ?
పొలిటికల్ లీడర్‌ను ఎదుర్కొనేందుకు ప్లాన్.!

పొలిటికల్ లీడర్‌ను ఎదుర్కొనేందుకు ప్లాన్.!

‘మంత్రి గారి వియ్యంకుడు'లో చిరంజీవిలా కాకుండా ఇప్పటి పరిస్థితులకు తగ్గట్లు తారక్ పాత్రను క్రియేట్ చేశాడట త్రివిక్రమ్. ఇందులో భాగంగానే ఓ పొలిటికల్ లీడర్‌ను ఎదుర్కొనే యువ వ్యాపారవేత్తగా అతడు నటించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. పొలిటికల్ టచ్ ఉన్నప్పటికీ.. ఈ మూవీలో కామెడీ కూడా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X