మరొక రికార్డు అందుకున్న కొమురం భీమ్ టీజర్.. ఇదే నెంబర్ వన్!
టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా నేషనల్ వైడ్ గా అత్యదిక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న RRR సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమాకు సంబంధించిన బజ్ రోజురోజుకు మరింత ఎక్కువవుతోంది. దర్శకుడు రాజమౌళి సినిమాను అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేస్తాడా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే సినిమా మాత్రం ఎప్పుడు వచ్చినా కూడా సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు.
అందానికి అందంగా ఈ పుత్తడి బొమ్మ... ప్రియా భవానీ శంకర్ బ్యూటీఫుల్ ఫోటో గ్యాలరీ
దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం నిర్మాత డివివి. దానయ్య దాదాపు 450కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇక అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తుండగా కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే మొత్తానికి కొమురం భీమ్ టీజర్ మరొక సరికొత్త రికార్డును అందుకుంది. ఇప్పటివరకు తెలుగులో ఏ టీజర్ కూడా అందుకోని రికార్డును అందుకుంది.

రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదలైన కొమురం భీమ్ ఇంట్రడక్షన్ టీజర్ 50మిలియన్ వ్యూవ్స్ అందుకుంది. యూ ట్యూబ్ లో ఈ రికార్డును అందుకున్న మొట్ట మొదటి టీజర్ గా రికార్డుకెక్కింది. టీజర్ తోనే ఈ రేంజ్ లో వండర్ క్రియేట్ చేశారు అంటే ఇక టీజర్ వస్తే ఆ బజ్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహలకు అందడం లేదు. ఇక మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఉండడంతో ఆ రోజు RRR నుంచి మరేదైనా స్పెషల్ అప్డేట్ వస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











