For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR మూవీతో ఎన్టీఆర్ గొప్ప రికార్డు: టాలీవుడ్‌లోనే మొదటి హీరో.. అప్పుడు అలా ఇప్పుడు ఇలా!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అన్ని విభాగాల్లో అదరగొట్టే హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్, పాటలు ఇలా ఎన్నో రకాల టాలెంట్లను బయట పెట్టిన అతడు.. టాలీవుడ్‌ ఆల్‌రౌండర్‌గా గుర్తింపును తెచ్చుకున్నాడు. దీంతో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. ఫలితంగా కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను సైతం తన పేరిట లిఖించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా RRR మూవీతో ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు ఎన్టీఆర్. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  వరుస విజయాలతో తారక్ దూకుడు

  వరుస విజయాలతో తారక్ దూకుడు

  కొంత కాలంగా జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ‘టెంపర్' నుంచి ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్', ‘జై లవ కుశ', ‘అరవింద సమేత.. వీరరాఘవ' వంటి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టాలీవుడ్ హీరోల్లో టాప్ పొజిషన్‌కు చేరువ కావడంతో పాటు తన మార్కెట్‌ను గణనీయంగా పెంచుకుని సత్తా చాటుతున్నాడు యంగ్ టైగర్.

  అతడితో కలిసి వస్తున్న కొమరం భీం

  అతడితో కలిసి వస్తున్న కొమరం భీం

  జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). ‘బాహుబలి' తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో మెగా హీరో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం ఇస్తున్నారు.

  RRR కోసం నందమూరి హీరో సాహసం

  RRR కోసం నందమూరి హీరో సాహసం

  ఎన్టీఆర్ నటించిన సినిమా విడుదలై దాదాపు రెండేళ్లు గడిచిపోయింది. అప్పటి నుంచి RRR మూవీపైనే అతడు ఫోకస్ చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్‌లో తన టాలెంట్ చూపించాలన్న పట్టుదలతో ఉన్న యంగ్ టైగర్.. అందుకు అనుగుణంగానే ఈ సినిమా కోసం ఎన్నో సాహసాలు చేస్తూ కష్ట పడుతున్నాడు. అలాగే, అన్ని భాషల్లో స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు.

  స్పెషల్ వీడియోతో అరుదైన రికార్డులు

  స్పెషల్ వీడియోతో అరుదైన రికార్డులు

  గతంలో ‘రామరాజు ఫర్ భీం' పేరిట జూనియర్ ఎన్టీఆర్ పరిచయ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో అతడి క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే, రామ్ చరణ్ వాయిస్ ఓవర్ కూడా బాగానే సెట్ అయింది. ఈ వీడియో 24 గంటల్లోనే 14.14 మిలియన్ వ్యూస్ సాధించి చరిత్రను తిరగరాసింది. అలాగే, ఒక మిలియన్ లైకులు, ఒక మిలియన్ కామెంట్లు దక్కించుకుంది.

  ట్రెండ్ క్రియేట్ చేసిన జూనియర ఎన్టీఆర్

  ట్రెండ్ క్రియేట్ చేసిన జూనియర ఎన్టీఆర్

  మే 20న నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో తెగ హడావిడి చేశారు. ఇందులో భాగంగా ట్విట్టర్‌లో #ManOfMassesNTR, #HappyBirthdayNTR, #KomaramBheemNTR, తదితర హ్యాష్ ట్యాగులతో లక్షల సంఖ్యలో ట్వీట్ల వర్షం కురించారు. దీంతో తారక్ పేరు ట్రెండ్ అయిపోయింది.

  కొమరం భీం లుక్‌తో గర్జించిన జూనియర్

  కొమరం భీం లుక్‌తో గర్జించిన జూనియర్

  జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా RRR మూవీలోని ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో తారక్ రౌద్ర అవతారంలో కొమరం భీంగా కనిపించాడు. చేతిలో బల్లెం పట్టుకుని కసిగా చూస్తున్న తారక్ పోస్టర్‌కు ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. దీంతో ఇది సోషల్ మీడియాలో కాసేపట్లోనే వైరల్ అయిపోయింది.

  Jr NTR వదులుకున్న Blockbusters | Happy Birthday NTR || Filmibeat Telugu
  RRR మూవీతో ఎన్టీఆర్ అరుదైన రికార్డు

  RRR మూవీతో ఎన్టీఆర్ అరుదైన రికార్డు

  కొమరం భీం ఫస్ట్ లుక్ పోస్టర్‌తో జూనియర్ ఎన్టీఆర్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దీన్ని విడుదల చేసేందుకు అతడు చేసిన ట్వీట్‌కు ఏకంగా లక్షకు పైగానే కామెంట్లు వచ్చాయి. ఇలా చాలా తక్కువ సమయంలోనే లక్ష కామెంట్లను అందుకున్న ట్వీట్‌గా ఇది నిలిచింది. దీంతో టాలీవుడ్‌లో ఏ హీరోకూ సాధ్యం కాని ఓ రికార్డు తారక్ సొంతం అయింది.

  English summary
  Tollywood Young Hero Jr NTR Busy with RRR Shooting. Recently This Movie Unit Released Komaram Bheem First Look Poster. Now this poster create new Record.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X