HBD Jr NTR: జూ ఎన్టీఆర్ ఆస్తులు ఎన్నివందల కోట్లంటే? బాలరాముడి నుంచి డ్రాగన్ వరకు సంపాదన ఎంతంటే?

నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి మూడో తరం నటుడిగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్. ఈ జనరేషన్‌లో నవరసాలను అద్భుతంగా పలికించగల.. సింగిల్ టేక్‌లో ఎంతటి క్లిష్టమైన షాట్‌నైనా ఓకే చేయగల అరుదైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు తారక్. కోట్లాది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రేపు (మార్చి 20). ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానుల సందడి తారాస్థాయికి చేరింది. దేశం దాటి విదేశాల్లోనూ తారక్‌కు ఉన్న క్రేజ్ మరోసారి స్పష్టమవుతోంది. ముఖ్యంగా RRR సినిమా తర్వాత ఆయన ఇమేజ్ పూర్తిగా మారిపోయి, త్వరలో డ్రాగన్ మూవీతో రాబోతున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ నెట్ వర్త్ ఎన్ని కోట్లంటే?

నందమూరి కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ, ఎన్టీ రామారావు మనవడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన తారక్.. 20-5-1983న నందమూరి హరికృష్ణ - శాలిని దంపతులకు జన్మించారు. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న ఎన్టీఆర్.. దేశంలోని పలు ప్రదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. తన తాత ఎన్టీఆర్ ఒడిలో నటనలో ఓనమాలు నేర్చుకున్న ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్రలో పెద్దాయనతో కలిసి నటించారు. ఆ తర్వాత 13 ఏళ్ల వయసులో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలరామాయణంలో అద్భుతంగా నటించి ప్రశంసలు దక్కించుకున్నారు. తొలి సినిమాకే ఏకంగా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు.

Jr NTR Birthday Special From Bala Ramayanam to Dragon His Net Worth amp amp Assets Revealed

అనంతరం సినిమాలకు బ్రేక్ చెప్పి చదువుపై దృష్టి సారించిన ఎన్టీఆర్ .. స్టూడెంట్ నెం.1 సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత సింహాద్రి, ఆది వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించాడు. మధ్యలో కొంత వెనుకబడ్డప్పటికీ, 'టెంపర్', 'జనతా గ్యారేజ్', 'అరవింద సమేత' వంటి సినిమాలతో మళ్లీ బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆ తర్వాత 'ఆర్ఆర్ఆర్'తో కెరీర్‌లోనే అతిపెద్ద మైలురాయిని చేరుకున్నాడు. త్వరలో డ్రాగన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇక ఆర్థికంగా కూడా ఎన్టీఆర్ అత్యంత విజయవంతమైన హీరోల్లో ఒకరిగా నిలిచాడు. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఆయన ఆస్తుల విలువ సుమారు రూ.500 కోట్లకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. ఒక్కో సినిమాకు రూ.45 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారంట. బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా కూడా భారీ ఆదాయం పొందుతున్నారు. నెలకు సుమారు రూ.3 కోట్ల వరకు సంపాదిస్తున్నారని సమాచారం.

ఆస్తుల విషయానికి వస్తే, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఆయనకు ఉన్న విలాసవంతమైన ఇల్లు సుమారు రూ.25 కోట్లకు పైగా విలువ చేస్తుందని చెబుతారు. అంతేకాకుండా రూ.80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ కూడా ఆయన సొంతం. బెంగుళూరు, ఇతర ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఉన్నట్లు సమాచారం. కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే తారక్, తన భార్యకు 'బృందావనం' పేరుతో వ్యవసాయ భూమిని గిఫ్ట్‌గా ఇచ్చారంట.

లగ్జరీ లైఫ్‌స్టైల్‌లో కూడా ఎన్టీఆర్ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన వద్ద ఉన్న ఖరీదైన కార్ల కలెక్షన్ లంబోర్ఘిని ఉరస్, పోర్స్చే 911, రేంజ్ రోవర్, మెర్సిడెస్-బెంజ్ GLS వంటి కార్లు ఉన్నాయి. వీటి విలువలు కోట్లలో ఉంటాయి. అదేవిధంగా వాచ్‌లపై ప్రత్యేక ఆసక్తి ఉన్న ఆయన, రిచర్డ్ మిల్లే, పటేక్ ఫిలిప్ వంటి బ్రాండ్‌ల ఖరీదైన గడియారాలను కలిగి ఉన్నారు. ఇక కెరీర్ పరంగా ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అతి తర్వలో డ్రాగన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ఇలాగే మరిన్ని సూపర్‌హిట్ సినిమాల్లో నటించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఫిల్మీ బీట్ కోరుకుంటోంది.

Read more about: ntr birthday jr ntr dragon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X